నారాయణపేట, ఏప్రిల్ 1 : నిత్యం నారాయణపేట ని యోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న అభి వృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అభాండాలు మోపడం సరికాదని టీఆర్ఎస్ జిల్లా నాయకులు హెచ్చరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిలిండర్, పె ట్రోల్, డీజిల్ ధరల పెంపుపై గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన కాంగ్రెస్ యువజన నాయకుడు మాట్లాడుతూ పెట్రోల్ డీ జిల్ ధరలు ప్రభుత్వం తగ్గించాలని మాట్లాడడం చూస్తుం టే ఆయనకు రాజకీయాలపై ఎంత అవగాహన రాహిత్యం ఉందో తెలుస్తుందన్నారు. అంతేగాక పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్లనే పేటకు ఎమ్మెల్యే రాలేకపోతున్నారని అనడం కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. వారంలో 5రోజులు నియోజకవర్గంలో ఉంటూ పేటను ఎం తో అభివృద్ధి చేస్తున్నాడో కండ్ల్లముందు జరుగుతున్న అభివృద్ధి పనులు కాంగ్రె స్ నాయకులకు కనిపించడం లేదా అ ని ప్రశ్నించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడైనా మీ మామకు అసలు పెట్రోల్, డీజిల్‌కు డబ్బులు లేక నిన్న జరిగిన ధ ర్నా కార్యక్రమానికి రాలేకపోయారన్న విషయాన్ని ముందుగా సదరు కాంగ్రె స్ యువజన నాయకుడు చెప్పాలని అ న్నారు. ప్రస్తుత జిల్లా దవాఖాన ఎవ రు కట్టారో ఎంత నాసిరకంగా కట్టారో తెలుస్తుందన్నారు. ఇకపై మా నాయకుడిపై గాని, పార్టీపై గాని ఆరోపణలు చేసే సమయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హి తవుపలికారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు చంద్రకాంత్, పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ హరినారాయణ్ భట్టడ్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహారెడ్డి, కౌన్సిలర్ గు రులింగప్ప, సర్పంచులు గురునాథ్‌గౌడ్, రామ్మోహన్ తది తరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికావు
దన్వాడ, ఏప్రిల్ 1 : ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిపై కాం గ్రెస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సరికావని టీ ఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు సునీల్‌రెడ్డి అన్నా రు. మండలకేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడికి రాజకీయ అవగాహన లేకుండా ఎ మ్మెల్యేను విమర్శిస్తే ఊరుకోబోమన్నారు.