గద్వాల, మార్చి 30 : గట్టు ఎత్తిపోతలను ప్రతిపక్ష నేతలు మంజూరు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. గద్వాలకు చెందిన ప్రతిపక్ష నాయకురాలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై మాట్లాడడం.. దెయ్యాలు వేదా లు వల్లించినట్లుగా ఉందని ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతాన్ని గుర్తుకు పెట్టుకొ ని మాట్లాడాలన్నారు. గతంలో చెరువులను నింపేందుకు రూ.పదిన్నర లక్షలు మంజూరు చేయించారని.. దానిని పట్టుకొని గట్టు ఎత్తిపోతల తామే మంజూ రు చేయించామని చెప్పు కోవడం సిగ్గు చేటన్నారు. గట్టు ఎత్తిపోతలను ఎన్నికల నినాదంగా వాడుకున్నారే తప్పా ఏనాడూ నిర్మించాలనే ఆలోచన చే యలేదన్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్‌పై ముసలి కన్నీరు కారుస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టు ప నులు అడ్డుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అవినీతి బాగోతం ప్రజలందరికీ తెలుసన్నారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్‌లో నాణ్యత లో పించడం వల్లే లీకేజీలు అవుతున్నాయని.. దాని మరమ్మతుల కోసం తె లంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. నెట్టెంపాడ్ ప్రాజెక్టు పేరుతో ప్రతిపక్ష నేత భారీ దోపిడీకి పాల్పడిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడిగడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే.. బీజేపీ నాయకులకు మింగుడు పడక అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ధా న్యం కొనుగోలు విషయంలో బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతును రాజు చే యడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సమావేశంలో ధరూర్ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్, నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.