మహబూబ్‌నగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎనిమిదేండ్లుగా ఎదురూచూస్తున్న మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ రైల్వే డబుల్‌లైన్ పనులు మంగళవారం తో పూర్తయ్యాయి. ఇప్పటికే ఫలక్‌నుమా-గొల్లపల్లి మధ్య డబ్లింగ్, విద్యుద్దీకరణ పూర్తవగా.. ఇటీవలే మహబూబ్‌నగర్- దివిటిపల్లి మధ్య కూడా పనులు పూర్తయ్యాయి. కాగా, దివిటిపల్లి-గొల్లప ల్లి మధ్య మంగళవారం సాయంత్రం జడ్చర్ల సి గ్నల్గడ్డ వద్ద డబుల్ ట్రాక్ చివరి పనులు పూర్తి చేసిన తర్వాత కొన్ని రైళ్లు ఈ ట్రాక్‌పై తిరిగా యి. బుధవారం నుంచి డబుల్ ట్రాక్‌పై పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు కొనసాగనున్నా యి. డబ్లింగ్ పూర్తయిన నేపథ్యంలో మహబూబ్‌నగర్ నుంచి కాచిగూడకు గంటలోనే చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఫలక్‌నుమా వరకు తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లను ఉందానగర్ (శంషాబాద్) వరకు పొడిగించనున్నట్లు సమాచారం. దీంతో ఆర్టీసీ బస్సుల్లో శంషాబాద్ వరకు చేరుకున్నా.. ఉందానగర్ నుంచి లోకల్ రైళ్లలో కాచిగూడ, సికింద్రాబాద్, లింగంపల్లి, నాంపల్లి, మే డ్చల్ మార్గంలో త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఏర్పడింది. ఇక సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా మరికొ న్ని మహబూబ్‌నగర్ వరకు తిప్పే వీలవుతుంది.
ఎనిమిదేండ్లు సాగదీత..
రైల్వే లైన్ల కేటాయింపు, నిధుల విడుదలలో ఆది నుంచి తెలంగాణకు అన్యాయమే జరుగుతున్నది. ఎప్పటి నుంచో సింగిల్‌లైన్, డీజిల్ ఇంజన్లకే పరిమితమైన అనేక రైల్వే లైన్లపై కేంద్రం శీతకన్ను వేస్తూ వచ్చింది. 2015-16లో రూ.774 కోట్లతో రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) చేపట్టిన సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. తాజా బడ్జెట్లో రూ.150 కోట్లు కేటాయించడంతోపాటు అధికారులు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మార్చి నెలాఖారులోపే డబ్లింగ్ పనులు పూర్తి చేశారు.
పెరగనున్న సదుపాయాలు..
సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మార్గంలో డ బ్లింగ్ పనులతోపాటు స్టేషన్లలో సౌకర్యాల కల్పనకు రైల్వే శాఖ పెద్దపీట వేస్తున్నది. అధునాతన స్టేషన్ భ వనాలు, వసతులు, నూతన ఫ్లాట్‌ఫాంలు, ఫుట్ఓ వర్ బ్రిడ్జీలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాట్లు చేశారు. కొత్తగా వేసిన ట్రాక్‌తోపాటు అప్పటికే ఉన్న ట్రాక్‌పై గంటకు 130 కిలోమీటర్ల వేగంతో 25 టన్నుల యాక్సిల్ లోడ్ రైళ్లు, గూడ్స్ ప్రయాణించేలా తీర్చిదిద్దారు. మహబూబ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 113 కి.మీ. దూరాన్ని కేవలం 1:10 గంటల్లో చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్యాసింజర్ రైళ్లలో 2 గంటలు పట్టనున్నది. డబ్లింగ్ పూర్తవ్వడంతో మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య లోకల్ ట్రైన్లు తిప్పే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే నడుస్తున్న డెమో (డీజిల్) రైళ్ల స్థానంలో మెమో (విద్యుత్) రైళ్లను ప్రారంభించనున్నారు. ఉందానగర్ స్టేషన్ ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ పెరుగుతుంది. మహబూబ్‌నగర్- కర్నూల్ మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నై, బెంగళూరు మార్గాల్లో పూర్తి స్థాయి విద్యుత్ రైళ్లు నడుస్తాయి. ఇందుకు మరో మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
డబ్లింగ్ పూర్తి.. పెరగనున్న రైళ్లు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన రైల్వే లైన్ అయిన సికింద్రాబాద్- డోన్ మార్గం డబ్లింగ్ పనుల్లో అడుగు ముందుకు పడింది. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య ఉన్న 113 కి.మీ. రైల్వే మార్గంలో 88 కి.మీ. మేర డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు గతంలోనే పూర్తయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొత్త లైన్‌తో ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని 130 కి.మీ.కు పెంచారు. మహబూబ్‌నగర్-గొల్లపల్లి మధ్య పెండింగ్‌లో ఉన్న పనులు కూడా మంగళవారంతో పూర్తయ్యాయి. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు, కడప, చెన్నై, తిరుపతి, మైసూరు, మంగళూరు మొదలైన ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడనున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ల వేళల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో సింగిల్ ట్రాక్‌కు తగ్గట్లుగా రైల్వే టైమింగ్స్ ఉండేవి. దీంతో మహబూబ్‌నగర్ నుంచి కాచిగూడ చేరుకునేందుకు లోకల్ రైళ్లకు 3 నుంచి 4 గంటలకు పైగా, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 2 నుంచి 3 గంటలకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు డబుల్ ట్రాక్ కావడంతో క్రాసింగుల గందరగోళం తగ్గిపోతుంది. ఫలితంగా కొత్త టైమింగ్స్ ఇచ్చి ప్రయాణికుల కష్టాలు తీర్చాల్సి ఉన్నది.