మహబూబ్‌నగర్, మార్చి 30 : కేంద్ర ప్రభు త్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వామపాక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, ఉ ద్యోగస్తులు మంగళవారం పట్టణంలో నిరసన తె లిపారు. ప్రజల సంక్షేమాన్ని మరిచి వ్యవహరించ డం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో నా రాయణనాయక్, సత్యనారాయణ, ఆనంద్, ర ఘు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఐసీ కార్యాలయం ఎదుట..
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 29: కేం ద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌కు అమ్మకాన్ని నిలిపివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే 130కోట్ల భారతీయుల ఆస్తులని ఇన్సూరెన్స్ సెంట్రల్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడు వీ రాజేశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎల్ఐసీ కార్యాల యం ఎదుట చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. ఎల్ఐసీలో ఐపీవోను తేవాలని నిర్ణయించిందని ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. దొడ్డిదారిలో ఎల్ఐసీలో ఉ న్న ప్రత్యేక చట్టాన్ని బడ్జెట్లో పొందుపర్చి చట్టసభల ఆమోదం పొందారన్నారు. ఐపీవో అమలైతే పాలసీదారులకు నష్టం వాటిల్లే ఆవకాశం ఉందన్నారు.
కార్మిక చట్టాలను సవరించి కేంద్ర ప్రభు త్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. కార్మిక చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం ఉపసహరించుకోవాలని తెలిపారు. సమ్మెకు ఎల్ఐసీ క్లాస్1 అధికారుల సంఘం, డెవలప్మెంట్ అధికారుల సంఘం మద్దతు తెలిపారు. కార్యక్రమం లో బ్రాంచ్ కార్యదర్శి కరుణాకర్‌గౌడ్, జావిద్ హుస్సేన్, నారాయణనాయక్, సత్యనారాయణ, ప్రవీణ, రాజేందర్, రాములు, మల్లయ్య, ఆనం ద్, ఇష్రత్అలీ, ఖదీర్, సాయిరెడ్డి, రఘ, అబ్ర హం, సాయిబాబా, నరేందర్, శ్రీనివాస్, శ్రీరామచంద్రుడు, వాల ప్రశాంత్ పాల్గొన్నారు.