జడ్చర్లటౌన్, మార్చి 28 : ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు రాములు అన్నా రు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యో గ, కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం కార్మిక సం ఘాల ఆధ్వర్యంలో జడ్చర్ల ఎంపీడీవో కా ర్యాలయం నుంచి పట్టణ ప్రధానకూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మిక సం ఘాల నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకోసం రైతు, కా ర్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ప్రజలపై పన్నులభారం మోపుతున్నదని ఆరోపించారు. రైల్వే, పోస్టల్, బ్యాంకింగ్, విమానయానం, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, విశాఖ ఉ క్కును కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చే సే కుట్ర చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి నష్టం కలిగిస్తున్నదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీ యూసీ, టీఆర్ఎస్కేవీ, కేవీపీఎస్, రైతు సంఘాల నా యకులు సత్యయ్య, జగన్, సురేశ్, వెంకటేశ్‌గౌడ్, పరశురాం, నాగరాజు పాల్గొన్నారు.
హోరెత్తిన నిరసన
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్య తిరేక విధానాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భా గంగా జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీ ని ర్వహించారు. కార్యక్రమంలో కార్మిక సం ఘాల నాయకులు కిల్లె గోపాల్, చంద్రకాం త్, కురుమూర్తి, ఎర్ర నర్సింహులు, బాలరాజు పాల్గొన్నారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ రీజియన్ ఉపాధ్యక్షుడు పరశురాముడు, కార్యదర్శి అనిల్‌కుమార్, సీఐటీయూ అధ్యక్షుడు కిల్లె గోపాల్ మాట్లాడుతూ కేంద్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.