భూత్పూర్, మార్చి 3 : ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం హేయనీయమని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. భూత్పూర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యభూమిక పోషించారని గుర్తుచేశారు. పాలమూరును అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్న మంత్రిపై హత్యకుట్ర చేయ డం దారుణమన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హాని చేయాలని చూస్తే సహించమని హెచ్చరించారు. సమావేశంలో సిం గిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, సాయిలు, గోప్లాపూర్ సత్యనారాయణ, అశోక్, రాము, రాకేశ్ ఉన్నారు.
జితేందర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్రను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్‌టీఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ మాట్లాడుతూ పాలమూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్ర చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరేశ్, పట్టణ అధ్యక్షుడు జయన్న, రావుల కృష్ణ, మండల అధ్యక్షుడు రఘు, ఆశన్న, నరేశ్, యాదగిరి, వెంకటయ్య, శివరాములు పాల్గొన్నారు.
అభివృద్ధిని ఓర్వలేకే కుట్రలు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. జిల్లాకేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాయిల్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, గోపాల్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, నారాయణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రాజశేఖర్‌గౌడ్, శశిధర్‌గౌడ్, బుచ్చన్నగౌడ్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.అలాగే ఎమ్మార్పీఎస్ నాయకుడు రాయికంటి రాందాస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. టీజీవో నాయకులు బక్కశ్రీను, టైటస్‌పాల్, నాగార్జున, ఉద్యోగ సంఘాల నాయకులు క్రాంతికుమార్‌గౌడ్, శ్యాంసుందర్‌రెడ్డి, మధుసూదన్గౌడ్తదితరులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
చర్యలు తీసుకోవాలి
అందరి సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కుట్ర చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలోని టీఎన్జీవోఎస్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంచాలని కోరారు. కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి చంద్రానాయక్ పాల్గొన్నారు.
జడ్చర్లలో రాస్తారోకో
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపలి లక్ష్మి, టీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, లత, దేవా, రమేశ్, చైతన్యచౌహాన్, మహేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీ.మురళి, టీఆర్ఎస్ నాయకులు కొంగళి జంగయ్య, రవీందర్, బృందం గోపాల్, శ్రీకాంత్, ఇంతియాజ్, కొండల్, కృష్ణారెడ్డి, నర్సింహయాదవ్, అబ్దుల్లా, అలీం, ప్రీతమ్ పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
ఉద్యమనేత, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మండలకేంద్రంలోని ప్రధానరహదారిపై టీఆర్ఎస్ నాయకులు రా స్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల అ ధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, ఎంపీపీ బాలరాజు, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్, డైరెక్టర్లు లక్ష్మయ్య, రమణారెడ్డి ఉన్నారు.
కోయిలకొండ మండలంలో..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కు కుట్ర చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ని చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం మండల అధ్యక్షుడు పవన్ మాట్లాడుతూ పాలమూరును అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేయడం హేయమైన చర్యన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహేందర్‌గౌడ్, జగన్‌గౌడ్, సుదర్శన్‌గౌడ్, నరేందర్‌గౌడ్, రవిగౌడ్, ఆనంద్‌గౌడ్, రాజుగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, భరత్‌గౌడ్, ప్రతాప్‌గౌడ్, బాలు, బాబు, సత్యయ్య, భాస్కర్, ప్రవీణ్, రాఘవేందర్, శివ, రఘు, కొండన్న, శ్రీకాంత్, హరీశ్ పాల్గొన్నారు.
హత్యకుట్రపై ఖండన
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్రను ఖండిస్తున్నట్లు పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు దుంకుడు శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఉద్యో గ, ఉపాధ్యాయుల శ్రేయోభిలాషి అయిన మంత్రిపై ఇలాం టి కుట్రలు చేయడం సరికాదన్నారు.
అరెస్టు చేయాలి
అందరి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన నిందితులను అరెస్టు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.ప్రబాకర్ ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీసులు మరింత వేగంగా దర్యాప్తు చేసి కుట్ర చేసిన వారిని అరెస్టు చేసి చట్టపరమైన శిక్ష పడేలా చూడాలని కోరారు.
బీసీల జోలికొస్తే ఖబడ్దార్
బీసీల జోలికొస్తే సహించేదిలేదని ముదిరాజ్ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు పట్టల మురళి హెచ్చరించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచిపేరు తెచ్చుకున్న బీసీ నాయకుడిని ఎదుర్కోలేక ఇలాంటి చర్యకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
కుట్ర చేయడం దారుణం
జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే కుట్రలు చేస్తున్నారని సర్పంచ్ గోపీనాయక్ ప్రకటనలో పేర్కొన్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేయడం దారుణమన్నారు.