మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 3 : పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రచేయడంపై టీఆర్ఎ స్ నాయకులు ఒక్కసారిగా భగ్గుమన్నా రు. కట్టలు తెంచుకున్న భావోద్వేగంతో రగిలిపోయారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీగా చేరుకున్నారు. మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ హత్యకు కుట్రపన్నిన సూత్రదారులను వెంటనే అరెస్ట్ చేయాలని ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులు పెద్ద ఎత్తు న చేరుకొని నిరసనలు తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. పాలమూరు అభివృద్ధికి నిరంత రం పనిచేస్తున్న మంత్రిని హతమార్చేందుకు కుట్రలు చేయడం దుర్మార్గమన్నా రు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ మ హిళా విభాగం సభ్యులు తెలంగాణ చౌ రస్తాలో జితేందర్‌రెడ్డి, డీకే అరుణ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కార్యక్రమం లో నాయకులు కోరమోని నర్సింహు లు, కోరమోని వెంకటయ్య, రాజేశ్వర్‌గౌడ్, చెరుకుపల్లి రాజేశ్వర్, సుదీప్‌రెడ్డి, జావేద్ బేగ్, ఆనంద్‌గౌడ్, శివరాజ్, తాటిగణేశ్, గోపాల్ యాదవ్, ప్రవీణ్, శివకుమార్, వనజ, పద్మ పాల్గొన్నారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నిన నిందితులకు సహకరించిన మా జీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్వీ నాయకులు దాడి చేశారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌రెడ్డి, నా యకులు ర్యాలీగా జితేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఇరువురు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో జితేందర్‌రెడ్డి ఇంటిపై రాళ్లు పడడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.