మహబూబ్‌నగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సా గుతోందని, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అయితే ఆయనను రాజకీయంగా ఎ దుర్కోలేక కొందరు దుర్మార్గంగా హత్యకు కుట్ర పన్నారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఇలాంటి పిరికిపందల చ ర్యకు తాము భయపడబోమని.. మంత్రికి అండగా ఉం టామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కు సుపారి ఇచ్చిన వ్యవహారాన్ని పోలీసులు బట్టబయ లు చేసిన సందర్భంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో హత్యారాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో కొందరు మంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేక హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మం త్రి హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితులెవరో వారికి ఎవరు సహకరించారనే అంశం ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మారెడ్డి తెలిపారు.
ఇది రాక్షస క్రీడ : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నిన అం శంపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమైన, రాక్షస చర్యగా అభివర్ణించారు. ఇటువంటి సంఘటనను ఊహించలేదన్నారు. ఉద్యమ నాయకుడు, ప్రభుత్వంలో క్రియాశీల నాయకుడి హత్యకు కుట్ర చేయడం దారుణమైన విషయమన్నారు. ప్రశాంతంగా ఉండే పాలమూరులో ఇటువంటి చర్యలను సహించబోమన్నారు. తెలంగాణ పోలీసులు తొందరగా స్పందించడం వల్లే ఇంత పెద్ద కుట్ర బయటపడిందన్నారు. కిడ్నాపుల పేరిట ముఖ్యమంత్రి, మం త్రిపై బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడార ని.. ఇంత పెద్ద కుట్రకు సహకరించిన బీజేపీ నాయకు లు ఇప్పుడేం సమాధానం చెప్తారని ఆల ప్రశ్నించారు. బీజేపీ నేతలు బీహార్‌లో హత్యారాజకీయాలు చేశారని.. తెలంగాణలో కూడా అలా చేయాలంటే కుదరదని హె చ్చరించారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో డీకే అరుణ,జితేందర్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించి కుట్రదారులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మహబూబ్‌నగర్, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్లు కొరమోని నర్సింహులు, బస్వరాజ్ గౌడ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాద్మి శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్, ఇంతియాజ్ పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు
ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్రలను ఎమ్మెల్యే ఖండించారు. పోలీసులు ఛేదించడంతో పెద్ద ముప్పు తొలిగిందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. నిందితులకు బీజేపీ నేతలు అండగా ఉన్నారన్నారు. ఇలాంటి యత్నాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.