మక్తల్ టౌన్, మార్చి 1 : మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధికి శాయశక్తులా సహకారం అందిస్తానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపల్ పరిధి 7వ వార్డులోని వాటర్ ట్యాంక్ నుంచి వెంకటరమణ థియేటర్ వరకు ఎమ్మెల్సీ నిధులు రూ.10లక్షలతో సీసీ రో డ్డు నిర్మాణాన్ని మంగళవారం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ.2 కోట్లు, వార్డుల అభివృద్ధి కోసం రూ.5కోట్లు విడుదల చే యించామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కష్టపడుతున్నానని, అభివృద్ధి చేసుకొనే బాధ్యత కౌ న్సిల్ సభ్యులదేనన్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణం వల్ల కూరగాయల వ్యాపారస్తులకు కేటాయించామన్నారు. ము న్సిపాలిటీలో కూరగాయలు విక్రయించే వ్యాపారస్తులంద రూ ఒకే చోట వ్యాపారం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించామన్నారు. అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు వార్డుల అభివృద్ధికి సూచనలు సూచించామని ఆయన చెప్పారు. మున్సిపాలిటీకి ఆదాయం సమకూరే పనులు చేపట్టినప్పుడే వార్డులు అభివృద్ధి చేసుకోవడానికి కౌన్సిల్ సభ్యులకు సు లువవుతుందన్నారు. ప్రతి పనికీ ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్‌పై ఆధారపడితే అభివృద్ధి సాధ్యపడదన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పావని, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే సీఎం లక్ష్యం
గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని వర్కూర్లో ఉపాధి హామీ పథకం నుంచి నిధులు రూ.8లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం ప్రారంభించారు. అదే గ్రామానికి రూ.15లక్షలు ఫై నాన్స్ కింద నిధులు మంజూరుగా కాగా.. డ్రైనేజీల నిర్మా ణం కోసం ముందుగా రూ.6లక్షలతో పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్ నిర్మల మ్మ, వైస్‌ఎంపీపీ తిప్పయ్యరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.