శ్రీశైలం, మార్చి 1 : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం లో మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చే సే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు అధిక సంఖ్య లో భక్తులు చేరుకున్నారు. శివరాత్రి పర్వదినం రోజు జ రిగే ప్రధాన ఘట్టాలైన పాగాలంకరణ, లింగోద్భవకాల ప్రత్యేక పూజలు, భ్రామరి, మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని వీక్షించారు. కొవిడ్ నిబంధనలు అమలు చేయుటలో భాగంగా ప్రతి ఏడాది కంటే భిన్నంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అవకాశం కల్పించామని ఈవో లవన్న చెప్పారు. అదే విధంగా పాగాలంకరణ, కల్యాణంలో పాల్గొనే వీఐపీ పాస్‌ల సంఖ్య కూడా తగ్గించినట్లు తెలిపారు.
పాగాలంకరణ.. లింగోద్బవ కాల పూజలు
శ్రీశైలేశుని వరునిగా చేసే అద్భుత ఘట్టమే పాగాలంకారం. ఈ పాగను ప్రకాశం జిల్లా హస్థినాపురానికి చెం దిన పృథ్వీ వెంకటేశ్వర్లు శివరాత్రి కల్యాణానికి స్వామివారి సువర్ణ గర్భాలయ కలశంపై నుంచి నవనందుల ను కలుపుకొంటూ ప్రత్యేక ఆకృతిలో అలంకరించారు. ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో దిగంబరుడైన పృథ్వీ వేంకటేశ్వరులు చీకట్లో పాగాలంకరణ చేయడం స్వామివారి భక్తికి నిదర్శనం అని ఈవో అన్నారు. కఠోర నియమాలతో సంవత్సరాంతం రోజు కో మూరచొప్పున నేసి శివయ్యను పెళ్లి కొడుకును చే సేందుకు ఆభరణంగా ఉపయోగించడం సంప్రదాయం గా అర్చకులు పేర్కొన్నారు. మరోవైపు లింగోద్భవ సమయంలో గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈవో ఎస్ లవన్న ఆధ్వర్యంలో 11 మంది నిష్ణాతులైన వేదపండితులు స్వామివారికి మహన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం సుమారు నాలుగు గంటల పాటు శ్రీశైల మల్లన్నకు వివిధ రకాల శుద్ధ జలాలు, పండ్లరసాలతో అభిషేకించారు. జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి శిష్య బృందంతో మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు.
ఆదిదంపతుల లీలాకల్యాణం
లింగోద్భవం అనంతరం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్ల లీలాకల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో స్వామికి పట్టు వస్ర్తాలతో సర్వాలంకరణశోభితులై నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య నేత్రానందకరంగా కల్యాణోత్సవం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకను తిలకించారు.
శ్రీగిరిలో శోభాయమానంగా ప్రభోత్సవం..
ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభమై నందిమండపం వరకు సాగిన ప్రభలో వేలాది భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కోలాటాలు, చెక్కభజనలు, సంప్రదాయ మేళాల చప్పుళ్లు, కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం నందివాహన సేవ నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భ్రామరీ సమేత మల్లికార్జున స్వామి కూర్చోబెట్టి షోడషోపచార పూజ లు నిర్వహించినట్లు ఈవో తెలిపారు.