భూత్పూర్, ఫిబ్రవరి 22 : ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కప్పెటలో సీసీరోడ్లు, మహిళా సంఘం భవనం, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆల ప్రారంభించారు. అలాగే పోతులమడుగ-కప్పెట రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధులాంటి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. అలాగే ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేయడంవల్ల పనులు నిలిచిపోయాయని, అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కురుమయ్యకు ల్యాప్‌టాప్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, స ర్పంచ్ వేణుగోపాలాచారి, సత్యనారాయణ, సాయిలు, వెం కట్రాములు, శ్రీనివాస్‌రెడ్డి, అజీజ్, మాసయ్యగౌడ్, నర్సింహులు, కురుమయ్య, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.