జడ్చర్లటౌన్/రూరల్, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బాదేపల్లి ఉన్నత పాఠశాల, నేతాజీ చౌరస్తాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేక్ కట్ చేశారు. ఎంఈవో మంజులాదేవి సహకారంతో విద్యార్థులకు నోట్‌పుస్తకాలను అందజేశారు. అలాగే మొక్కలు నాటారు. సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10మంది దివ్యాంగులకు త్రిటైర్ స్కూటీలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతులమీదుగా అందజేశారు. 40మంది జర్నలిస్టులకు డబుల్బెడ్రూం ఇండ్ల నెంబర్ల కేటాయింపును ప్రకటించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంఘాలకు రూ.3.75కోట్ల చెక్కును అందజేశారు. అలాగే టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల యూత్ అధ్యక్షులు వీరేశ్, శ్రీను, పట్నం బంగారు, వెంకటేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
ముఖ్యమం త్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను గ్రామగ్రామానా టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అడ్డాకులలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. పెద్దమునగల్చేడ్లో జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి కేక్ కట్ చేయడంతోపాటు వడ్డెపల్లిలో కొబ్బరి మొక్కలను పంపిణీ చేశారు. మూసాపేట మండలంలోని జానంపేటలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్తోపాటు స్థానిక నాయకులు పటాకులు కాల్చి వేడుకలను నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పలువురికి రూ.2.60లక్షల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలో ము ఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. దేవరకద్ర, కౌకుంట్ల, గోపన్‌పల్లి, డోకూర్ రైతువేదికల వద్ద మొక్కలు నాటడంతోపాటు కేక్ కట్ చేశారు. స్థానిక బాలుర వసతిగృహం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే వివిధ గ్రామాల్లో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. పాఠశాలల్లో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొండా సుగుణ, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు కొండారెడ్డి, వైస్‌ఎంపీపీ సుజాత, సర్పంచులు కృష్ణారెడ్డి, కృష్ణవేణి, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి, పరమేశ్, వెంకట్రాములు, భాస్కర్‌రెడ్డి, ఏవో రాజేందర్ అగర్వాల్, ఏఈవోలు శ్రీనివాస్, మౌనిక, హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, మురళీధర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, బాసిద్, కల్పన, రజియాబేగం, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మండలంలోని పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఓబ్లాయిపల్లి రైతువేదిక వద్ద రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి ఆ ధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు స మితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, ఎంపీపీ సుధాశ్రీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మ న్ ఆంజనేయులు, సర్పంచులు రమ్య, ఊశన్న, చంద్రకళ, ఉపసర్పంచ్ రాంచంద్రయ్య, కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్, రవీందర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్ ఉన్నారు.
చిన్నచింతకుంట మండలంలో..
మండలవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణ లో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మొక్కలు నాటా రు. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో సర్పంచ్ మోహన్‌గౌడ్, పూ ర్వవిద్యార్థి భాస్కర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోటరాము, కురుమూర్తి ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, తాసిల్దార్ సువర్ణరాజు, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, రైతుబంధు సమితి కన్వీనర్ మ ల్లయ్య, వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, టీఆర్ఎస్ నాయకులు రాజేంద్రప్రసాద్‌గౌడ్, గిరిధారి నాగన్న, శ్రీనివాస్‌రెడ్డి, మాధవరెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, నారాయణగౌడ్, రా ములు, లక్ష్మీనారాయణగౌడ్, నజీమ్, మోసిన్ ఉన్నారు.
హన్వాడ మండలంలో..
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా హన్వాడ కేజీబీవీ ఆవరణలో మొక్కలు నా టారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఎంఈవో రాజునాయక్, ఎంపీటీసీ వడ్ల శేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌ డ్, సాయిలు, రమణారెడ్డి, నాగన్న పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
మండలంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మం డలకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మొక్కలు నాటారు. రాజాపూర్, తిర్మలాపూర్, చొక్కంపేట పాఠశాలల విద్యార్థులకు ఎంపీటీసీ అభిమన్యురెడ్డి ఆంగ్ల నిఘంటువులు, కంప్యూటర్ అందజేశారు.