మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 17 : పాలమూరు అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. రూ.కోటి 60 లక్షల తో ఏర్పాటు చేయనున్న పక్షుల ఎంక్లోజర్కు శంకుస్థాపన చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో రూ. 17 కోట్ల విలువైన చెక్కులు, ల్యాప్‌టాప్‌లు, స్కూటీలు, కుట్టుమిషన్లు, 250 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక సీ ఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో పేదరికం పోయేదాక అవిశ్రాంత కృషి చేస్తామన్నారు. మహానాయకురాలి భర్త జిల్లాను అభివృద్ధి చేయకుండా నాశనం చేశారని, గుండాగిరి చేయడమే కాకుండా బ్రిడ్జిలు వేయడానికి కాంట్రాక్టు తీసుకొ ని వాటి నిర్మాణాలు మరిచి అధికారులను బెదిరించారని ఆరోపించారు. పాలమూరులోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును సందర్శించేందుకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారని తెలిపారు. వీరన్నపేటలో రూ.125 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ ఇటీవలే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా మారిందన్నారు. హె చ్‌ఎండీఏ తర్వాత ఇదే పెద్దది అన్నారు. జిల్లా అధికారులందరూ టీంవర్క్‌గా పని చేస్తున్నారని చె ప్పారు. ఇదే పట్టుదలతో ముందుకు అడుగులు వేయాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మూడ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తం గా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ముడాగా ఏర్పాటు కానున్నందున కలెక్టర్ నేతృత్వంలో అధికారులు మంత్రిని సన్మానించారు. 2014 నుంచి జిల్లా అభివృద్ధికి రూ.32,829 కోట్లు మంజూరు కాగా.. రూ.22,430 కోట్లు ఖర్చు చేశారు. ఈ అంశంపై రూపొందించిన గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు బై పాస్ రోడ్డులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, అదనపు క లెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామరావు, డీఎఫ్‌వో గంగారెడ్డి, సీఎఫ్‌వో క్షితిజా, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీఆర్డీవో యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, డీఈవో ఉషారాణి, జెడ్పీ సీఈవో, కో ఆపరేటివ్ జిల్లా అధికారి టైటాస్ పాల్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.