మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 17 : రాష్ట్ర వ్యా ప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జ రుపుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు కాన్ఫరెన్స్ హాల్లో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లతో కలిసి గురువారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించారని తెలిపారు. ఇది చూసి ఓర్వలేక రెండు జాతీయ పార్టీల నేతలు సభ్య సమాజం త ల దించుకునేలా వ్యవహరిస్తున్నారని మం డిపడ్డారు. రాహుల్ గాంధీ గురించి అస్సాం సీఎం మాట్లాడితే.. సీఎం కేసీఆర్ స్పందిం చే దాకా కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించ లేదన్నారు.
స్పందించిన సీఎం కేసీఆర్‌పై నీ చంగా ప్రవర్తించడం సరికాదన్నారు. అపర భగీరథుడి పు ట్టిన రోజున నిరసన కార్యక్రమాలు చేయడం.. గాడిదపై ఊరేగిస్తామనడం అనైతికమన్నారు. సీఎం కేసీఆర్‌ను జా తీయ నాయకత్వం వహించాలని దేశ ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఇది గిట్టక ప్రధాన జాతీయ పార్టీలు నీఛంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు.సీఎం కేసీఆర్‌ను విమర్శించే తీరు మార్చుకోకుంటే.. ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. స భ్యసమాజం తలదించుకునేలా జాతీయ పార్టీల అధ్యక్షుల తీరు ఉన్నదని దుయ్యబట్టారు.