మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10 : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలను వైభవం గా నిర్వహించాలని అధికారులను క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశ మందిరంలో మన్యంకొండ వెంకన్న బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశానికి మం త్రి హాజరయ్యారు. ఆలయ కమిటీ, అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ 11 నుంచి 18 వరకు జరి గే లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఉత్సవాలు కనుల పండువ గా నిర్వహించాలన్నారు. అలాగే మార్చి 16 నుంచి 20 వరకు అలివేలు మంగ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొండపై 18 గదులు నిర్మాణంలో ఉన్నాయని, ఏసీ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్న ట్లు చెప్పారు. మహబూబ్‌నగర్-రాయిచూర్ రహదారి వద్ద ఉన్న స్వాగత తోరణం నుంచి కొండపై వరకు రో డ్డు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రోడ్డు మధ్య లో డివైడర్, లైటింగ్ ఏర్పాటు చేయాలని, ఫుట్‌పాత్‌తో తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని సూచించారు. పారిశుధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు చర్యలు చే పట్టాలని ఆదేశించారు.
కొండపైన, అలివేలు మంగమ్మ ఆలయాల వద్ద తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, షీ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. కోనేరు వద్ద షవర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. హెల్ప్ డెస్క్తోపాటు కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవ సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. తాగునీటికి కష్టాలు లేకుం డా మిషన్ భగీరథ బాటిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ అన్నదాన కా ర్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో క లెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మన్యంకొం డ ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్, అదనపు కలెక్ట ర్ తేజస్‌నందలాల్ పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా అ ధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి డైరెక్టర్ నరసింహారెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరావు, దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులున్నారు.