జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 10 : అబద్ధపు మాటలు, అసత్యప్రచారాలు చేస్తున్న బీజేపీ.. బడా జూటా పార్టీ అని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో రైతువేదిక భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలొచ్చాయంటే మత విద్వేషాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ యత్నిస్తున్నదని ఆరోపించారు. ఎంఐఎం అధినేత ఒవైసీపై కాల్పులు జరిగిన తీరు.. మరుసటి రోజు బీజేపీ నాయకులు పట్టుబడిన వైనం చూస్తే ఎవరు ఎవరితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారో అర్థమవుతుందన్నా రు. కర్ణాటకలో జరుగుతున్న గొడవ.. ఎక్కడ తెలంగాణకు వ్యాపిస్తుందోనన్న ఆందోళన కలుగుతుందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో గొడవలు మొదలై కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కర్ఫ్యూలతో సామాన్య ప్రజలే నష్టపోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసి రోహింగ్యాలను తరిమేస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పిన బండి సంజయ్.. ఏడాది కావొస్తున్నా సర్జికల్ స్ట్రైక్ ఎక్కడపోయిందన్నారు.
కేవలం అధికారం కోసం బీజేపీ దిగజారుడు మాటలతో ప్రజలను మ భ్యపెడుతున్నదన్నారు. వాజ్‌పేయ్ హయాంలోనే బీజేపీకి సిద్ధాంతాలు ఉండేవని, ఇపుడు అవేమిలేవన్నారు. తెలంగాణపై ప్రధాని నరేంద్రమోదీ వివక్ష చూపడం సరికాదన్నారు. 8ఏండ్లుగా విభజన అంశాల పరిష్కారంపై శ్రద్ధ చూపని మోదీకి తెలంగాణ ప్రజలు బాగుపడుతుంటే బాధ కలుగుతున్నదన్నారు. ఇక్కడి బీజేపీ ఎంపీలు ప్రత్యేకంగా తెలంగాణకు ఒక్క రూపాయి తెచ్చినట్లు చూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. అధికారం కోసం దేవుళ్లను సైతం వాడుకుంటున్న దౌర్భాగ్యమైన పార్టీ బీజేపీ అని విమర్శించారు.
రైతులు బాగుపడుతుంటే ఓర్వలేకపోతున్నారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలతో రైతులు బాగుపడుతుంటే ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రైతులకు 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్, సాగునీటిని అందించడంతోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తుండటంతో సస్యశ్యామలంగా రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతువేదికలను ఏర్పా టు చేసి రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలను తమిళనాడులోనూ అమలు చేయాలని ఇటీవల దక్షిణభారత రైతు సంఘం నాయకులు అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఇక్కడ అమలవుతున్న ఒక్క పథకం కూడా బీజేపీపాలిత రాష్ర్టాల్లో లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు.
అనంతరం మల్లెబోయిన్పల్లిలో ఎమ్మె ల్యే పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమం లో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సంగీత,నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొంగళి జంగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్యానాయక్, మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, వ్యవసాయశాఖ ఏడీ ఆంజనేయులు, ఏవో గోపినాథ్, ఏఈవో నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
బహుమతులు ప్రదానం
సీఎన్ఆర్ ఫౌండేషన్, ట్రస్మా ఆధ్వర్యంలో రైతుబంధు, నాడు-నేడు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీ ల్లో గెలుపొందిన విద్యార్థులకు జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, ట్రస్మా అధ్యక్షుడు అయూబ్‌ఖాన్, నరేశ్, శ్రీహరి, మేఘారెడ్డి, శ్రీను, టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డులో 15వ తేదీన నిర్వహించనున్న సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను గురువారం జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్‌ను గిరిజనులు ఆదర్శం గా తీసుకొని సమాజసేవకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, నాగిరెడ్డి, సేవాలాల్ ఉత్సవ కమి టీ అధ్యక్షుడు లింబ్యానాయక్, గౌరవాధ్యక్షుడు చందర్‌నాయక్, నాయకులు సేవ్యానాయక్, రాజునాయక్, మన్యానాయక్, శంకర్‌నాయక్, జానునాయక్, లక్ష్మణ్‌నాయక్, రాం దాస్‌నాయక్, రాంచందర్, చందూనాయక్ పాల్గొన్నారు.