మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : రాష్ర్టాలకు సమదృష్టితో న్యాయం చేయాలనే ఉద్దేశమే కేంద్రంలో కనిపించడం లేదని, అందుకే పీఎం మోడీకి రామానుజాచార్యులు కలలో వచ్చి అన్ని రాష్ర్టాలను సమదృష్టితో చూడాలని ఉపదేశం చేస్తే బాగుండేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపే ట మండల కేంద్రంలో ఎంజేఆర్ ట్రస్ట్ సహకారంతో రూ.3 కోట్లు ఖర్చు చేసి అధునాతన సదుపాయాలతో నిర్మించిన జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే మర్రి జ నార్దన్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విద్యార్థులు, ఉపాధ్యాయు లు, పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని రంగా ల్లో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్రం నుంచి సహకార మే కరువైందన్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ర్టానికి కేంద్రం సహకారమే లేకుండా పోయిందన్నారు. తెలంగాణ భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభా ప్రకారం 12వ స్థానం లో ఉన్నా.. దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడుతున్న రాష్ర్టాల్లో 4వ స్థానం అని ఆర్థికంగా రిజర్వ్ బ్యాంకు నివేదికలే వెల్లడిస్తున్నాయన్నారు. పేదరికంలో ఉన్న ఉత్తరాది రాష్ర్టాలైన యూపీ, ఎంపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో జాతి నిర్మాణంలో భాగస్వామ్యమవుతున్నది తెలంగాణ ప్రజల చెమట రక్తమేనన్నారు. అలాంటి తెలంగాణకు అండగా నిలబడాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలతోపాటు విద్యా సంస్థల ను ఇవ్వాలని రామానుజాచార్యులు ఉపదేశం చేస్తే బాగుండేదన్నారు. ఉమ్మడి జిల్లాను సుసంపన్నం చేయడానికి సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టారని, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే ప్రధానికి మన సు రావడం లేదన్నారు. కర్ణాటకలోని అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం మనకు మాత్రం అన్యాయం చేసిందన్నారు. ఈ ప్రాంతానికి కొత్త రైల్వే లైన్లు ఇవ్వడం లేదని, హైదరాబాద్ – బెంగళూరు హైవేను పారిశ్రామిక కారిడార్ గా గుర్తించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తె లంగాణ విజ్ఞప్తులు అరణ్య రోదనలు అవుతున్నాయని మంత్రి కేటీఆర్ పేరొన్నారు. కార్యక్రమంలో విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే లు డా.సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రె డ్డి, రాజేందర్‌రెడ్డి, బీరం హర్షవర్దన్రె డ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్రె డ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, గి డ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సా యిచంద్, జెడ్పీ వైస్ చైర్మన్ బా లాజీ సింగ్, ఎంజేఆర్ ట్రస్ట్ డై రెక్టర్లు మర్రి జమునారెడ్డి, జ క్కా రఘునందన్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, డీఈవో గో విందరాజులు పాల్గొన్నారు.
అన్నింటా అన్యాయమే..
సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం ఎలా ఉండేదో అందరికీ తెలుసని.. కానీ, తెలంగాణ వచ్చాక కేసీఆర్ మనువడు,
మనవరాండ్లు తినేలా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాఫూలే పేరిట ఓవర్సిస్ స్కాలర్‌షిప్‌ల కోసం ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. రూ.1600 కోట్ల మేర ఉపకార వేతనాలు అందిస్తున్న ఘనత టీర్ఎస్ సర్కార్‌దే అని చెప్పారు. విద్యారంగంలో తెలంగాణపై మోడీ అత్యంత నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు.
పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలి..
పది మందికీ ఉపయోగపడేలా పనులు చేస్తే చి రస్థాయిగా గుర్తుండిపోతామని మంత్రి కేటీఆర్ పేరొన్నారు. ఎమ్మెల్యే మర్రి వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. ఎంతో కష్టపడి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే వ్యాపారవేత్తగా ఎదిగారన్నారు. తనకు జన్మనిచ్చిన ప్రాంతాన్ని మరిచిపోకుండా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారని కితాబునిచ్చారు. కార్పొరేట్ పాఠశాలల కంటే తిమ్మాజిపేట హైస్కూల్ బాగుందన్నారు. ఇలాంటి పాఠశాలను ఎక్కడా చూడలేదన్నారు. హెచ్ఎం చాంబర్, స్టాఫ్ రూం, పిల్లలకు ల్యాబ్స్, భోజనశాల, గ్రౌండ్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వారు చదివిన బడికి సేవ చేయాలన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రవాసులు, ఇతర రాష్ర్టాల్లో ఉన్న వారు ఎంజేఆర్ ట్రస్టును స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
సీఎం మాటలపై అవాకులు, చెవాకులు..
కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటల్లో రాజ్యాంగాన్ని అవమానించారని ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. బోధించు-సమీకరించు-పోరాడు అన్న అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని 14 ఏండ్లుగా కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే.. దానిని తగులబెట్టడంలో నేనే ముందుంటా అని అంబేద్కర్ పేర్కొన్నాడన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటివరకు 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించాయని, మాజీ ప్రధాని వాజపేయి ఆధ్వర్యంలో కూడా కమిటీ వేశారని, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ కొత్త రాజ్యాంగం కావాలని కోరారని.. వీళ్లంతా రాజ్యాంగాన్ని అవమానించినట్లు భావించాలా అని ప్రశ్నించారు. ఏదో రకంగా కేసీఆర్‌ను బద్నాం చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నారు. ఆయన మాటలన్నీ తెలంగాణకు జరిగిన అన్యాయంపైనే అని అన్నారు. దళితులు, పేదలకు జరిగిన అన్యాయం గురించి సమాధానం చెప్పలేక, విషయపరిజ్ఞానం లేని కొందరు భావదారిద్య్రంతో విమర్శలకు దిగుతున్నారన్నారు. దళితుల మీద అంత ప్రేమ ఉంటే.. దేశమంతా దళితబంధు ప్రవేశపెట్టాలన్నారు. కేంద్రం తెలంగాణపై మాట్లల్లో మాత్రమే ప్రేమ చూపుతూ.. కేటాయింపుల్లో మాత్రం అన్యాయం చేస్తుందన్నారు. లాభాపేక్ష కోసమే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటికి కష్టాలు తీరడంతో.. రాయలసీమ, రాయిచూర్ నుంచి కూడా వలస వస్తున్నారని వెల్లడించారు. ఇదంతా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ హయాంలోనే సాధ్యమైందని చెప్పేందుకు
ఎంతో గర్వంగా ఉన్నది.
మౌలిక వసతుల కల్పనకు..
చిన్నప్పుడు మనం చదువుకున్న బడులకు.. ఇప్పటి బడులకు ఉన్న తేడాను అందరూ అర్థం చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి రంగంలోనూ పురోగతి వచ్చింది. విద్యారంగాన్ని ఓ యజ్ఞంలా భావిస్తున్నారు. గురుకులాలు ఈ స్థాయిలో ఉన్నాయంటే అందుకు సీఎం కేసీఆర్ మాత్రమే కారణం. గురుకులాల్లో సీట్ల కోసం పోటీ నెలకొన్నది. దేశానికే మన గురుకులాలు ఆదర్శంగా ఉన్నాయి. తిమ్మాజిపేట హైస్కూల్ స్థాయిలో పాఠశాలల్లో మార్పులు రావాలి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇందుకోసం రూ.7,300 కోట్లు కేటాయించగా.. తొలి విడతగా రూ.3,700 కోట్లు విడుదల చేశారు. ఇంగ్లిష్ మీడియం చదువులతో సమూల మార్పులు రానున్నాయి. తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ చదివిన పాఠశాల రుణం తీర్చుకోవాలి.
– సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
కేసీఆర్ స్ఫూర్తితోనే నిర్మించాం..
వేలాది రూపాయలు ఖర్చు చేసి తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఎన్నో బాధలు పడుతున్నారు. అలాంటి వారి కోసం కార్పొరేట్ తరహాలో తిమ్మాజిపేట జెడ్పీహెచ్‌ఎస్‌ను అభివృద్ధి చేశాం. ఇందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ సైతం స్ఫూర్తినిచ్చింది. చిన్నప్పుడు 7 కి.మీ. కాలినడకన వచ్చి ఇక్కడ చదువుకున్నాను. చీకటి గదిలో కనీస సౌకర్యాలు లేకుండా విద్యాభ్యాసం సాగింది. నాకు ఏర్పడిన లోటు ఇప్పటి విద్యార్థులకు లేకుండా చేసేందుకు ఈ బడిని నిర్మించాను. తిమ్మాజిపేటలోలాగే ఐదు మండలాలను దత్తత తీసుకుని అక్కడి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తాం. తాడూరు మండల కేంద్రం, సిర్సవాడలోనూ రూ.3 కోట్ల చొప్పున కేటాయించి నిర్మిస్తున్న పాఠశాలల ప్రారంభానికి కూడా మంత్రి కేటీఆర్ రావాలి. భవిష్యత్‌లో సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తాం.
– మర్రి జనార్దన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే
చదువు ఉంటే ప్రపంచాన్ని జయించొచ్చు..
ఎందరో సంపాదిస్తారు.. కానీ సంపదను పంచాలనే ఆలోచన కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. తాను చదువుకున్న పాఠశాలను బాగు చేసేందుకు ముందుకొచ్చిన తీరు ఎందరికో ఆదర్శం. చదువు ఉంటే ప్రపంచాన్ని జయించొచ్చు. అందుకే విద్యాలయాలను బాగుచేసుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు.సీఎం కేసీఆర్ సర్కార్‌లోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
మాట తప్పిన పీఎం మోడీ..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ మహబూబ్‌నగర్ బహిరంగ సభలో హామీ ఇ చ్చారు. అది ఇంతవరకు నెరవేరలేదు. పాలమూ రు పొలిమేరల్లో ఉన్న ముచ్చింతలలో సమతామూర్తి విగ్రహావిష్కరణకు వస్తున్న ప్రధాని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారా లేదో చెప్పాలి. ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పక్క రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారు. ఇక్కడి పథకాలను కేంద్ర మంత్రులు కూడా మె చ్చుకుంటున్నారు. గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. దళితబంధు పథకంపై రాద్ధాంతం చేస్తున్నారు. దళితులు ఉండే కాలనీల్లో అన్ని వర్గాల ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిన ఘనత తమదే. దళితబంధులాగే బీసీ, పేద ఓసీలకు సైతం పథకాలు వస్తాయి. దళితబంధును దేశమంతా అమలు చేసేందుకు బీజేపీ సర్కార్ సిద్ధమా..? సీఎంను కించపరి స్తే ఊరుకునేది లేదు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలు అవాక్కులు చెవాక్కు లు ప్రచారం చేస్తున్నారు. వారిని టీఆర్ఎస్ కార్యకర్తలు అదే స్థాయిలో ఎదుర్కోవాలి.
– వి.శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి
పట్టించుకోని గత ప్రభుత్వాలు..
గతంలో ప్రభుత్వాలు గ్రామాలు, రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. స్వాతంత్య్రం సాధించి 75 ఏండ్లు గడిచినప్పటికీ అన్ని అంశాల్లో నిర్లక్ష్యం వహించారు. తమ ప్రభుత్వం పార్టీలకతీతంగా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుంటే దేశం సూపర్ పవర్‌గా మారేది. కేంద్రం మాత్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. జడ్చర్ల పట్టణంలో వెయ్యి, గ్రామీణ ప్రాంతాల్లో మరో వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. ఎవరికైనా సొంత స్థలాలు ఉంటే ఇల్లు కట్టుకునేందుకు నిధులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
– డా.సి.లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే