వనపర్తి, డిసెంబర్ 21 : ‘ఒకసారి అవకాశం ఇవ్వం డి.. ఇదే చివరి సారి.. మళ్లీ ఎన్నికల్లో నేను నిలబడను’.. అనే మాటను మూడు పర్యాయాలుగా చెబుతూ వస్తు న్న మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి రాజకీయాల నుంచి ఇక సెలవు తీసుకోవాలని స్థానిక కాంగ్రెస్ నాయకుల నుం చి స్వరం వినిపిస్తున్నది. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపడాలంటే చిన్నారెడ్డి హటావో.. కాంగ్రెస్ బచావో అంటూ నినదిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ గాం ధీభవన్ దగ్గరలోని ఓ హాల్లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించడం హాట్ హాట్‌గా మారింది. నియోజకవర్గంలోని 7 మండలాల, వనపర్తి పట్టణ నాయకులు సుమారు 200 మంది సమావేశానికి హాజరయ్యారు. ఆయన తప్పుకుంటేనే కాంగ్రె స్ పార్టీ బలపడుతుందని పార్టీశ్రేణులు బాహాటంగానే చెబుతున్నారు. పార్టీని నమ్ముకుని ఏండ్ల తరబడి పని చేస్తున్న వారు నాయకులుగానే మిగిలిపోవాలా.. అన్న ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు కొత్త వారిని కోరుకుంటున్నారని, మనిషికి ఆశ ఉండాలే కానీ అత్యాశ ఉండకూడదని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు రాగానే నాయకులతో ఈసారి పోటీలు ఉంటానని, తర్వాత ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం చిన్నారెడ్డికి పరిపాటిగా మారిందన్నారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇదే చివరి సా రి అని చెప్పి పోటీ చేసి ఓడిపోగా.. తిరిగి ఎంపీ ఎన్నికల్లోనూ విజయం సాధించకుంటే మళ్లీ పోటీ చేయనని చిన్నారెడ్డి పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడే మే తుదిశ్వాస ఉన్నంతవరకు తానే పోటీ చేస్తానని చెబుతుండడం స్వార్థరాజకీయాలకు నిదర్శనమన్నారు.