మక్తల్ టౌన్, నవంబర్ 25 : ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల బంగారు భ విష్యత్తుకు వ్యాయామ ఉపాధ్యాయులే దిశా నిర్దేశకులని టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రఘుప్రసన్నభట్ అన్నారు. వ్యాయామ మాంత్రికు డు హ్యరీక్రోబక్ జయంతిని పురస్కరించుకొని వ్యాయామ ఉపాధ్యాయుల ది నోత్సవం సందర్భంగా విశ్రాంత వ్యా యామ ఉపాధ్యాయుడు గోపాలం అ ధ్యక్షతన పట్టణంలోని సత్యసాయిబా బా ఆలయ ఆవరణలో ఉమ్మడి జిల్లాలోని పీడీ లు, పీఈటీలకు శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ర ఘుప్రసన్నభట్ హాజరై ఫాదర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా హ్యరీక్రోబక్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యాయామ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని రాష్ట్రంలో మొదటి సారిగా మక్తల్లో ఏర్పాటు చేయడం చాలా సం తోషంగా ఉందన్నారు. 70 మంది వ్యాయామ ఉ పాధ్యాయులను ఘనంగా సన్మానించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జిల్లా గౌర వాధ్యక్షుడు తాన్సింగ్, మాస్టర్ అథ్లెటిక్స్ మండ లాధ్యక్షుడు సత్యాంజనేయులు, కంజ్యూమర్ ఫో రం మండలాధ్యక్షుడు అడమ్స్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.