జడ్చర్లటౌన్, నవంబర్ 14 : మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని సోమవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలోని ఎమ్మార్సీ భవనం లో ఎంఈవో మంజులాదేవి ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. అదేవిధంగా ప్రేమ్రంగాగార్డెన్ ఫంక్షన్హాల్లో ప్రపంచ మానవహక్కుల సంఘం ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక, క్రీడాపోటీ లు నిర్వహించగా, విజేతలకు మున్సిప ల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్ సతీశ్ బహుమతులను ప్రదానం చేశారు. అలాగే గైరాన్‌తండా, నక్కలబండతండా ప్రాథమిక పాఠశాలల్లో బాలల ది నోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. నక్కలబండతండా విద్యార్థులకు కౌన్సిలర్ చైతన్యచౌహాన్ సౌజన్యంతో బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మానవహక్కుల సంస్థ డైరెక్టర్ చెన్నయ్య, బాలమణి, రాధాకృష్ణ, ఇమ్యానియల్ పాల్గొన్నారు.
దేవరకద్ర, నవంబర్ 14 : మండలంలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. జీన్గురాల ప్రాథమిక పాఠశాల లో సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి విద్యార్థులకు టై, బెల్టులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకుడు భాస్కర్‌గౌడ్ ఉన్నారు.
మిడ్జిల్, నవంబర్ 14 : మండలంలోని చిల్వేర్, కొత్తపల్లి, బోయిన్పల్లి, మల్లాపూర్, రాణిపేట, వేముల, దోనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
హన్వాడ, నవంబర్ 14 : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేపూర్, మునిమోక్షం, గొండ్యాల ప్రభు త్వ పాఠశాలల్లో నెహ్రూ జీవిత చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భరత్, మం డల అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.
బాలానగర్, నవంబర్ 14 : మండలంలోని పెద్దరేవల్లి, వాయిల్‌కుంటతండా పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. పెద్దరేవల్లిలో మాజీ ఎంపీటీసీ తిరుపతిరెడ్డి విద్యార్థినికి సైకిల్‌ను అందజేశారు. కార్యక్రమంలో స ర్పంచ్ గోపీనాయక్, హెచ్ఎం రామ్మోహన్, శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, నవంబర్ 14 : కౌకుంట్ల పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
మూసాపేట, నవంబర్ 14 : బాలల దినోత్స వం సందర్భంగా హెచ్‌బీఎల్ పరిశ్రమ ప్రతినిధు లు జానంపేట అంగన్వాడీ చిన్నారులకు పలు పో టీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. అలాగే పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.