జడ్చర్లటౌన్, నవంబర్ 10: జడ్చర్ల మండలం గంగాపురం గ్రామ శివారులోని కాటన్మార్కెట్యార్డు సమీపంలో గురువారం డీసీఎం వాహనం ఢీకొన్న ప్రమాదంలో బైక్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న బండారి సాయి అనే యువకుడికి తీవ్రగా యాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు ..జడ్చర్ల మండలం గంగాపురం గ్రామానికి చెందిన బండారి సాయి గంగాపురం నుంచి జడ్చర్లకు బైక్పై వస్తుండగా గంగాపురం శివారులోని కాటన్మార్కెట్యార్డు సమీపంలో ఎదురుగా నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొన్నది. దీంతో బైక్ కింద పడి మంటలు చెలరేగడంతో ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఈ క్రమంలో బైక్పై ప్రయాణీస్తున్న బండారి సాయి తీవ్రంగా గాయప డ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జడ్చర్ల దవాఖానాకు తరలించారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనంతోపాటు డ్రైవర్ పరారు కావడంతో వాహనాన్ని పట్టుకునేందుకు మన్ననూర్ టోల్గేటు వద్ద మిడ్జిల్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై క్షతగాత్రుడి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.