గద్వాల అర్బన్, నవంబర్ 7 : కొన్ని రోజులు గా జిల్లా కేంద్రంలో న్యూడ్ వీడియో కాల్, ఫొటోలకు సంబంధించి పలు అశ్లీల చిత్రాలు సామాజిక మాద్యమాల్లో వస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం సుమోట కేసుగా నమోదు చేసి ఇద్దరు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో జిల్లా కేంద్రానికి చెందిన కొంత మం ది రాజకీయ యువ నాయకులు ఒక గ్యాంగ్‌గా ఏ ర్పడి అమాయక మహిళలను లోబర్చుకొని వారికి తెలియకుండానే సున్నితమైన విషయాలను చిత్రీకరిస్తున్నట్లు విచారణలో వ్యక్తమైంది. ఇందులో 10 మంది యువ నాయకులు ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని సీక్రెట్‌గా విచారించినట్లు తెలిసింది. ఈ కేసులో యువ నాయకులు ఉండడంతో జిల్లా కేంద్రానికి చెందిన ముఖ్యనాయకుడు తన పరపతిని ఉపయోగించి తన అనుచరులను విడిపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.
పోలీసుల సహకారం తో తన అనుచరులను విడిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టి అమాయకులపై చర్యలు తీసుకునేలా చక్రం తిప్పినట్లు సమాచారం. కేసును తనకు అనుకూలంగా మార్చేందు కు జిల్లా పోలీస్ అధికారికి భారీ మొత్తంలో ముడుపులు అప్పచెప్పినట్లు ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. అధికారులు కూడా సదరు రాజకీ య నాయకుడి అడుగు జాడల్లో నడుస్తూ అసలు నిందితులను తప్పించి అమాయకులపై చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బాధిత మహిళల సోదరుడిగా భావించి జిల్లాకు చెంది న హైకోర్టు న్యా యవాది మహిళలను బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తులపై కఠిన చ ర్యలు తీసుకొని, బాధిత మహిళలకు సంబంధించి వీ డియోలు, ఫొటోలు తొలగిం చేలా చర్యలు తీసుకోవాలని డీ జీపీ, గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రేమ పేరుతో మహిళలు, విద్యార్థులను ట్రాప్‌చేసి నగ్న చిత్రాలను తీసి వారిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్న
గద్వాల టౌన్ ఎస్సై బదిలీ
గద్వాల టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తు న్న హరిప్రసాద్‌రెడ్డిని ఆకస్మికంగా బదిలీ చేస్తున్నట్లు సోమవారం పోలీస్ వర్గాలు పేర్కొన్నా యి. గద్వాల నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జా రీ చేసినట్లు తెలిసింది. న్యూడ్ వీడియోకాల్ కేసుకు సంబంధించి ఆరోపణల నేపథ్యం కారణంగానే బదిలీ అయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఉందతం వెనుక ఉన్నది ఓ పోలీస్ ఉన్నతాధికారి అయితే బదిలీ చేసిం ది మరో పోలీస్ అధికారి అనే సందేహాలు ప్రజలకు మొదలయ్యాయి.
మహిళల సెమీ న్యూడ్ ఫొటో సర్క్యూలేట్కు సంబంధిం చి మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రంజన్త్రన్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో కొ న్ని రోజులుగా సామాజిక మాద్యమాల్లో ప్రతికల్లో వచ్చిన కథనాల మేరకు సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపా రు.
డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్ విచారణలో భాగంగా తిరుమలేశ్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి ఒక పార్టీలో మ ద్యం తాగి పడిపోగా కాశపోగు నిఖిల్ అనే వ్యక్తి ఆ ఫోన్ చూసి అందులో ఉన్న సెమీ న్యూడ్ ఫొటోలను తన మిత్రులు క్రాం తికుమార్, వినోద్ కుమార్, రంజిత్‌కు మహేశ్వర్‌రెడ్డి ఇలా చేస్తున్నాడని తెలియచేసేందుకు పంపినట్లు తెలిపారు. ఒకరి ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని నిఖిల్ వినోద్‌కు పం పడం అతని సామాజిక మాద్యమంలో పోస్ట్ చేయడం కలక లం రేపాయి. ఈ విషయమై ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేయగా తాజాగా వినోద్‌కుమార్, నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎవరి వద్ద అయినా ఫొటోలు, వీ డియోలు ఉంటే తక్షణమే డెలీట్ చేయాలని వైరల్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో శివకుమార్, నాగరాజు ఉన్నారు.