నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 6:మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఘనవిజయం సాధించడంపై ఆదివారం జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యక ర్తలు, అభిమానులు విజయోత్సవ సంబురాలు అంబరాన్నంటేలా జరుపుకొన్నారు. ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా పెద్దఎత్తున పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అ నంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఇటీవ ల భారత రాష్ట్ర సమితి ప్రకటించిన సమయంలో తొలి ఎన్నిక మునుగోడులో జరిగింది. ఈ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో భారత రాష్ట్ర సమితికి మునుగోడు ఓటర్లు తొలి విజయం అందించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ల్లాలని ప్రజలు సం పూర్ణంగా కోరుకుంటున్నారు. మునుగోడు ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి బీజేపీ చెంప చెల్లుమనిపించారని నాయకులు అభివర్ణించారు. మునుగోడు ఓటర్లకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
–