ఆత్మకూరు, నవంబర్ 6: సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో తెలంగాణ ఫిష్ హబ్‌గా మారిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరులోని పరమేశ్వరస్వామి చెరువులో ఎమ్మెల్యే 40 వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగపుత్రులు ఆర్థికంగా ఎదిగేందుకే ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసి, వివిధ ప్రాజక్టులు, ప్రణాళికలతో చెరువులను నింపి, చేప పిల్లలను వదలడం వల్ల మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. మత్స్యకారులను అన్నిరకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. రాష్ట్రంలో నీలివిప్లవం ఏర్పడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రియాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, నాయకులు వీరేశలింగం, అనిల్‌గౌడ్, సిరాజ్, మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులు, కౌన్సిలర్ అశ్విన్‌కుమార్, పోషన్న, రాజు, కృష్ణ, శివన్న, నాగరాజు, ధర్మయ్య, చిన్నబాలన్న, గోవర్ధన్, మత్స్యశాఖ అధికారులు వీరేశ్‌కుమార్, భరత్, రాజు, రవి పాల్గొన్నారు.