వనపర్తి, నవంబర్ 3 : జిల్లాలో వారం పది రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. వా తావరణంలో మార్పులు రావడంతో సా యంత్రం 6 దాటిన తరువాత చలి పెరగ డం వల్ల రాత్రి వేళ్లలో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయం వేళలోఎండ సాధారణంగా ఉన్నప్పటికీ (సాయ ంత్రం) 6 దాటిన వెంటనే చలి కూడా అదే స్థాయిలో ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టింది. చలికాలంలో పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచింది. చలికాలంలో తీవ్రమైన చలితోపాటు జలుబు, దగ్గు లాం టి అనారోగ్యాలను మోసుకువస్తున్నది.
పిల్లల్లో ముఖ్యంగా జలుబు, దగ్గును అశ్రద్ధ చేస్తే న్యూ మోనియో వస్తుంది. ఈ వ్యాధితో పక్క టెముకలు ఎగరవేయడంతోపాటు ఊపిరితిత్తులోకి నిమ్ముచేరి కొన్ని సం దర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పిల్లలకు ఆ రు నెలల వరకు తల్లిపాలు తా గిస్తే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరకుండా ఉంటుంది.
ఆస్తమా వల్ల ఆయాసం, దగ్గు అధికంగా వస్తుంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండ డం వల్ల వ్యాధి వ్యాపించే అ వకాశాలు ఎ క్కువగా ఉంటాయి. ఆస్తమా అనేది అధికం గా వంశపార్యపర్యంగా సంక్రమిస్తుంది. చాతి పట్టేసినట్టు ఉండడం, ఆయాసం, దగ్గు, శ్వాస సక్రమంగా తీసుకోకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు దగ్గరలోని వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమా రోగులు పొగ తా గకూడదని, చలి గాలుల్లో ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా ఉన్ని దుస్తులను వేసుకోవాలని, జలుబు, దగ్గు వచ్చిన వెంటనే వైద్యుల సూచనల మేరకు మందులను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో పిల్లలు, వృద్ధులు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళ్లలో బయట తిరిగితే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఉబ్బసం, ఆస్త మా, వంటి వ్యా ధులు వ్యాప్తి చెందుతాయి. చలికాలంలో ఎండవచ్చే వరకు పిల్లలు, వృద్ధులు, ఆస్త మా వ్యాధిగ్రస్తులు బయటకు రాకూడ దు. ప్రధానంగా ఉన్ని దుస్తులతోపాటు శరీరానికి వెచ్చదనం ఇచ్చే దుస్తులను వేసుకోవాలని, ఇండ్లలో సాధ్యమైనంత వరకు ఏసీలను వాడరాదని, ఫ్యాన్ వేగా న్ని తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో పిల్ల లు, వృద్ధులు, ఆ స్తమా వ్యాధి ఉన్న వారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వాతావర ణ మార్పు వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద యం, సాయంత్రం వేళ్లల్లో వెచ్చని దుస్తులు విధిగా ధరించాలి.
– శ్రీనివాసులు,
జిల్లా అదనపు వైద్యాధికారి, వనపర్తి