మక్తల్ టౌన్, నవంబర్ 3 : రాష్ట్రంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును గురువారం ఎమ్మెల్యే నివాసంలో ప ట్టణానికి చెందిన అబేధాబేగానికి రూ.24వేల చెక్కును అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలి క రోగాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నా రు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సీఎం సహాయనిధిని ప్రవేశపెట్టి ప్రజలకు వైద్య ఖ ర్చుల నిమిత్తం ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారన్నారు.
జాతీయ రహదారి 167 పునర్నిర్మాణంలో భాగంగా హై వే అథారిటీ భాగంలో ఏర్పాటు చేయిస్తున్న మక్తల్ వెల్కమ్ బో ర్డును ఎమ్మెల్యే పరిశీలించారు. మక్తల్ మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయనున్న వెల్కమ్ బోర్డును నాణ్యతతో చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. నిత్యం వేలాది వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వెల్కమ్ బోర్డు ఏర్పాటులో జా గ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు, హైవే అథారిటీ అధికారులు తదితరు లు పాల్గొన్నారు.