భూత్పూర్, నవంబర్ 3 : సమాజంలో బాలల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని బాలల సంరక్షణ కమిటీ జిల్లా కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని భట్టుపల్లిలో గురువారం సర్పంచ్ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బాలల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ మాట్లాడుతూ 14ఏండ్లలోపు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని సూచించారు. పిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
పిల్లల గు రించి తల్లిదండ్రులే కాకుండా సమాజంలో ప్రతిఒక్కరూ ఉన్నతంగా ఆలోచించాలని కోరారు. ముఖ్యంగా బాల్యవివాహాలను ప్రోత్సహించరాదని తెలిపారు. బాలల సంరక్షణ కోసం గ్రామాల్లో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిటీ చైర్మన్‌గా సర్పంచ్, కన్వీనర్‌గా అంగన్వాడీ టీచర్, సభ్యులుగా పంచాయతీ కా ర్యదర్శి, పాఠశాల హెచ్ఎం వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కా ర్యదర్శి వెంకటేశ్, హెచ్ఎం శ్రీధర్, అంగన్వాడీ టీచర్ పార్వతమ్మ పాల్గొన్నారు.
హన్వాడ, నవంబర్ 3 : బాలల హక్కుల సంరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని న్యాయవాది రవీందర్ అన్నారు. మండలంలోని వేపూర్, మునిమోక్షం, యారోనిపల్లి, గుండాల గ్రామాల్లో గురువారం జిల్లా న్యా య సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలను ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని తెలిపారు. పేద ల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ రాంచంద్రయ్యగౌడ్, రాజశంకర్, శంకరుడు పాల్గొన్నారు.