పాలమూరు, అక్టోబర్ 28 : నియోజకవర్గ ప్రజలు ఒ కసారి ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భం గా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రే వ్, ఆరేగుడెం గ్రామాల్లో శుక్రవారం భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మ ల్లారెడ్డి, టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఆరుగురు ఎ మ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలోకి పోయినా రాజగోపాల్‌రెడ్డి ఎమీ అభివృద్ధి చేస్తాడని పేర్కొన్నారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని ప ట్టుకొని ప్రజల మధ్య ఉన్న అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు. కర్ణాటక బీజేపీ ప్ర భుత్వంలో పింఛన్లు లేవు, గొర్రెలకాపరుల కు సాయం లేదు, కల్లు గీత కార్మికులకు అ న్యాయం చేస్తున్నారన్నారు. కర్ణాటకలో కల్లు నిషేధాన్ని ఎత్తేసి, అక్కడి కల్లు గీత కార్మికుల సమస్యలను తీర్చాలని ఆర్య ఈడిగ రాష్ట్రీ య మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామిజీ పాదయాత్ర చేస్తున్నారన్నారు. సబ్బండ వర్గాలన్నీ సీఎం కేసీఆర్ ప్ర భుత్వాన్ని కోరుకుంటున్నారు. దేశంలో అన్ని రంగాల్లో అభివ్వద్ధి చెందుతున్న తెలంగాణకు ప్రజలంతా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా చౌ టుప్పల్లో కల్లు గీత కార్మికుల సంఘాల నాయకులతో ఏ ర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం, మునుగోడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి కూసుకుంట్లు ప్రభాకర్‌రెడ్డి విజయం కో సం కష్టపడి పని చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.