మహబూబ్‌నగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత్‌జోడో యాత్ర పేరిట సోనియాగాంధీ తనయుడు రాహుల్‌గాంధీ చేపట్టిన యాత్రలో రెండోసారి తెలంగాణతల్లికి అవమానం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన నేతలు ఉత్సాహంగా రూ.వేలు ఖర్చుపెట్టి లాల్కోట చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ త ల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కనీసం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తీవిస్తున్నది. స్వయాన పార్టీ నేతలే అసంతృప్తి చెందుతున్నారు. నియోజకవర్గ నేతలను పట్టించుకోకుండానే యాత్ర ఏమిటని గుసగుసలాడుకుంటున్నారు. కాగా, బడా నేతలే రాహుల్ దర్శనం కోసం టెంట్ల వద్ద మీడియాతో కలిసి గంటలు గంటలు పడిగాపులు గాస్తున్నా రు. ఇక చోటామోటా నేతలైతే రోడ్ల పక్కన, చెట్ల కింద సేద దీరుతున్నారు. ఇక రాహుల్ రోడ్డు ఎక్కాడంటే అంతే ఆయన వెంట సీఆర్పీఎఫ్, ఎస్పీజీ, లోకల్ పోలీసులు దాదా పు 600 మంది ఉంటున్నారు. దీంతో అడ్డొచ్చిన వారిని తోసేస్తున్నారు. వేలకు వేలు ఖర్చుపెట్టి భారీ ఫ్లెక్సీలు కడితే తమకు పార్టీ నేతలు ఇచ్చే బహుమానం ఇదేనా అని రు సరుసలాడుతున్నారు. కాగా, జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించే సమయంలోనూ తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించకుండా అవమానించిన విషయం తెలిసిందే. వా రం ముందే నుంచే విగ్రహావిష్కరణకు భారీ ఏర్పాట్లు చేయగా.. రాహుల్ హడావిడిగా వచ్చి వెళ్లాడు. విగ్రహావిష్కరణ విషయాన్ని నేతలు చెబుతున్నా రాహుల్ వినిపించుకోకుండా వెళ్లినట్లు సమాచారం. దీంతో చేసేది లేక ఆ పార్టీ నాయకులే మీడియా కంటపడకుండా విగ్రహానికి పూలమాలలు వేశారు. అంతా ఢిల్లీ స్క్రీన్‌ప్లే ప్రకారం జరుగుతుందని పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద యాత్ర చేపట్టి తెలంగాణ సెంటిమెంట్‌కు గౌరవం ఇవ్వకుంటే ఎలా అని ఓ జిల్లా నేత స్వయంగా ప్రశ్నిస్తున్నారు. క నీసం పూలదండ వేయడానికి కూడా తీరిక లేకుండా పోయిందా? అన్న అసంతృప్తులు వినిపిస్తున్నాయి. బతుకమ్మలతో స్వాగతం పలుకగా..కనీసం బతుకమ్మల వద్దకు రా కుండానే రోడ్పైనుంచే వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది.
అధికారంలోకి రాగానే జీఎస్టీని సవరిస్తాం..
కేంద్రంలో అధికారంలోకి రాగానే జీఎస్టీని సవరించి దేశమంతా ఒకే జీఎస్టీ తీసుకొస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మన్యంకొండ వద్ద భారత్‌జోడో యాత్ర కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో నోట్ల రద్దుతో వ్యాపారులను సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుందని, ప్రజలనుంచి భూములు, డబ్బులు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాయని మోదీ ప్రభుత్వం ధ్వజమెత్తారు.