నాగర్‌కర్నూల్, అక్టోబర్ 19: బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని, బాలికల హక్కులను పరిరక్షించి వారి సంరక్షణకు పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి అన్నా రు. సమాజంలో బాలికల హక్కులు బాలికలకు మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు ద క్కేలా పాఠశాలస్థాయి బాలిక సాధికారిత క్లబ్బులు పనిచేసేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కో రారు. కలెక్టరేట్లో పోలీస్, విద్యా, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో పాఠశాలల్లో బాలిక సాధికారిత క్లబ్బుల నిర్వహణపై జి ల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మనూచౌదరి మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు లింగ అసమానతలను ఎదుర్కొంటున్నారన్నారు. బాలికలు లైంగిక, శారీరక వేధింపులకు గురవుతున్నారని, సంరక్షణపై పాఠశాలస్థాయిలోనే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్య పర్చాలని అధికారులకు సూచించారు.
పాఠశాలస్థాయిలో బాలికల సంరక్షణకు జిల్లాలో 95 ఉన్నత పాఠశాలల్లో బాలిక సాధికారిత క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎం పిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతు న్న బాలికలను ప్రతి తరగతి నుంచి యాక్టివ్‌గా ఉండే ఇద్దరు అమ్మాయిలు, ఒక మహి ళా ఉపాధ్యాయురాలిని ఎంపిక చేసి పాఠశాలల్లో సాధికారిత క్లబ్బులను ఏర్పాటు చే యాలన్నారు. ఆయా తరగతి గదుల్లో అ మ్మాయిలకు హాని కలిగించే సమస్యలు, దు ర్వినియోగం ప్రమాదకరమైన వాటి గురించి సకాలంలో టీచర్‌కు తెలపడం, టీచర్ ఆ స మాచారాన్ని జిల్లాస్థాయికి వాట్సాప్ ద్వారా చేరవేయడం జరుగుతుందన్నారు. దీంతో ప్రవర్తన, బెదిరింపు, ఈవ్ టీజింగ్ మొదలై న సమస్యలను అరికట్టడంతోపాటు సకాలం లో జోక్యంతో పాఠశాల, స్థానిక పోలీసుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. యుక్త వయస్సులో విద్యపై అవగాహన కల్పించడానికి పెరుగుతున్న మార్పు లు, ఆరోగ్యం, పరిశుభ్రత, లింగ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
అనంతరం అదనపు ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ మాట్లాడుతూ యుక్త వయస్సులో ఉన్న బాలికలు వారి సమస్యలను స్పష్టంగా చెప్పడానికి, వారి హక్కులను తెలుసుకోవడానికి పాఠశాలల్లో నిర్వహించే బాలిక సాధికారిత క్లబ్బులు ఎంతగానో దోహదపడుతాయన్నారు. సిగ్గు, భయం, ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం, స్వీయ, సంబంధాలు, తమ చుట్టూ ఉన్న సమాజానికి బాధ్యత వహించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. షీటీం ద్వారా బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలిక సంరక్షణ అధికారి చైతన్య, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, సీఐ నర్సింగరావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
తప్పులు దొర్లకుండా ఆన్లైన్లో నమోదు చేయాలి
ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డుల కోసం పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల సమాచారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో సక్రమంగా పొం దుపర్చాలని ఎంపీడీవోలు, ఎంపీవోలను అదనపు కలెక్టర్ మనూచౌదరి ఆదేశించారు. కలెక్టరేట్లో డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎం పీవోలతో జాతీయ పంచాయతీ అవార్డుల కార్యాచరణపై అదనపు కలెక్టర్ బుధవారం సమీక్షా నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 461జీపీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలకు సంబంధించిన డేటా ఎంట్రీ పనులు తప్పులు దొర్లకుండా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు.
వీటి ఆధారంగా ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వస్తారని, అప్లోడ్ చేసిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటి వరకు నమోదు చేసిన చాలా పంచాయతీల వివరాల్లో తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సమగ్ర వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. జాతీయస్థాయి ఉత్తమ గ్రామ పం చాయతీల నమోదు వివరాలను ఈనెల 31లోగా నమోదు చేయాలన్నారు. సమావేశంలో డీపీవో కృష్ణ, డీఆర్డీవో నర్సింగరావు, జెడ్పీ సీఈవో ఉష, అదనపు డీఆర్డీవో రాజేశ్వరి, శ్రీనివాసులు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు ఎంపీవోలు, ఏపీడీలు పాల్గొన్నారు.