జడ్చర్లటౌన్, అక్టోబర్ 19 : సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభు త్వ ఉద్యోగులపై ఉందని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. పౌష్టికాహార లోపం, విద్య, వైద్యం అంశాలపై బుధవారం జడ్చర్లలోని ఏఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఇటీవల పౌష్టికాహారలోపం విషయంలో నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే భారతదేశం 107వ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రా మాల్లో పౌష్టికాహారం విద్య, వైద్యసేవలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేస్తే పురోగతి సాధ్యమవుతుందన్నారు.
ముఖ్యంగా విద్య, వైద్యశాఖల ఉద్యోగులు కలిసి పని చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేస్తున్న పౌష్టికాహారంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలు చేపట్టే అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని తెలిపారు. పౌష్టికాహారం విషయంలో సర్పంచులు గ్రామ సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీ సూపర్వైజర్లు రోజూ నాలుగు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.
అదేవిధం గా ప్రాథమికస్థాయి నుంచి విద్యార్థుల్లో అ భ్యాసనా సామర్థ్యాలు మెరుగుపడేందుకు ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు పాఠశాలలను తనిఖీ చేయడంతోపాటు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎంఈవోలు ప్రతినెలా కనీసం 20 పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. అనంతరం సీడీపీవోలు, ఎంఈవో లు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సర్పంచులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, వైద్యశాఖ సిబ్బందితో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మిడ్జిల్ జెడ్పీటీసీ శశిరేఖ, డీఈవో రవీందర్, డీఎంహెచ్‌వో కృష్ణ, డీఆర్డీవో యాదయ్య, రాష్ట్రస్థాయి అధికారి నర్సింహారావు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, జిల్లా సంక్షేమశా ఖ అధికారిణి జరీనాబేగం, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్‌చైర్‌పర్సన్ సారిక, కమిషనర్ మహమూద్ షేక్, అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు, అక్టోబర్ 19 : యువత స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జెడ్పీ సమావేశ మందిరం లో బుధవారం ఖాదీ, గ్రామీణ పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో నిరుద్యోగ యువతీయువకులకు రూ.50లక్షలవరకు రుణసదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. కిరాణషాపులు వంటివి కాకుం డా మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, గృహోపకరణాలు, టెంట్‌హౌస్, పౌల్ట్రీహౌస్, డెయిరీ వంటి వ్యాపారం పెట్టడానికి ప్రభుత్వం రు ణాలు ఇస్తుందన్నారు. రుణాల మంజూరు లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ బాబూరావు, పీఎంఈజీ రాష్ట్ర నో డల్ ఆధికారి జి.నారాయణరావు, ఎల్డీఎం భాస్కర్, ఆర్బీఐ ఏజీఎం స్రావం, సేరికల్చర్ ఏడీ విజయలక్ష్మి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు డీవో రమేశ్‌కుమార్ ఉన్నారు.