జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 29: ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ కానుకగా ప్రతి ఆడబిడ్డకూ బతుకమ్మ చీరను అందజేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి చెప్పారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 10, 23వ వార్డుల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్, కుమ్మరి రాజు, మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జడ్చర్ల/బాలానగర్, సెప్టెంబర్ 29: ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా, బతుకమ్మ పండగ సందర్భంగా చీరలను సారెగా అందిస్తున్నదని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం 24వ వార్డులోని పద్మావతికాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. 12వ వార్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్ రఘురాంగౌడ్ చీరలను అందజేశారు. కార్యక్రమంలో 24వ వార్డు ఇన్చార్జి రమేశ్, ఆర్పీలు ప్రమీల, శ్రీలత, కాలనీవాసులు స్వప్న, రియాజ్బేగం, శంకర్బాయ్, మాధవి, కౌసల్య, ప్రణీత, మేనేజర్ శశిధర్, రాజు, మహేందర్, రఘుపతిరెడ్డి, నారాయణస్వామి, సుగుణమ్మ పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలోని చౌటగడ్డతండా, పెద్దాయికుంట తండాల్లో గురువారం జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమాలలో సర్పంచులు రవీందర్‌రెడ్డి, శారద, ఉపసర్పంచ్ రమేశ్, రఘుపతిరెడ్డి, మార్కెట్ డైరక్టర్ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. బాలానగర్ మండలంలోని వాయిల్‌కుంటతండా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గోపీనాయక్ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
కోయిలకొండ, సెప్టెంబర్ 29: మండలంలోని మోదిపూర్ గ్రామంలో గురువారం బతుకమ్మ వేడుకల్లో ఎంపీపీ శశికళా, సర్పంచ్ స్వప్నరవి గిరిజన మహిళలతో బతుకమ్మ ఆడారు. మండలంలో ప్రజాప్రతనిధులు బతకమ్మ చీరలను పంపిణీ చేశారు.
మహ్మదాబాద్, సెప్టెంబరు 29: మండలంలోని మంగంపేట్లో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి గురువారం బతకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, పీఏసీసీఎస్ డైరక్టర్ దశరథ్, టీఆర్ఎస్ నాయకుడు రమేశ్‌గౌడ్, లక్ష్మణ్, యమునమ్మ పాల్గొన్నారు.
నవాబ్‌పేట, సెప్టెంబర్ 29: మండలంలోని దాయపంతులపల్లి, చెన్నారెడ్డిపల్లి, హజిలాపూర్, రుద్రారం, కొండాపూర్ గ్రామాల్లో గురువారం ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, ముడా డైరెక్టర్ చెన్నయ్య, సింగిల్‌విండో డైరెక్టర్ ప్రతాప్, సర్పంచులు యాదయ్య, గంగమ్మ, బొజ్జమ్మ, లలితమ్మ, నాయకులు యాదయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, రవి, గండు తిరుపతయ్య పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29: జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో అట్ల బతుకమ్మ సంబురాలు గురువారం ఘనంగా జరిగాయి. ఐదో రోజు అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెడతారు. వేడుకల్లో విద్యుత్ శాఖ అధికారులు, మహిళా ఉద్యోగినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 29: అడ్డాకుల మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి ఆల మంజుల మహిళలతో కలిసి జోరువానలోనూ బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, సర్పంచులు విజయలక్ష్మీ, మంజుల, ఎంపీడీవో మంజుల టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.