SECIL | సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (SECIL) 28 మేనేజిరియల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రెగ్యులర్, ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన మేనేజిరియల్, ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులను నింపనున్నారు. వీటికి అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది.
ఖాళీలు
ఈ 28 ఖాళీలను జనరల్ మేనేజర్ 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ 1, డిప్యూటీ మేనేజర్ 10, అకౌంట్స్ ఆఫీసర్ 1, ఆఫీసర్ (HR & Adin) 3, ఇంజినీర్ (కార్పొరేట్ ప్లానింగ్) 1, సీనియర్ ఇంజినీర్ 11 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎల్ఎల్బీ, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతలతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. జీఎంకు 55, డీజీఎంకు 45, ఇంజినీర్‌కు 28, డీఎంకు 35, సీనియర్ ఇంజినీర్‌కు 33, ఆఫీసర్‌కు 35 ఏండ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రెగ్యులర్ పోస్టులకు రూ. 1000, ఫిక్స్డ్ టర్మ్ పోస్టులకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్లకు ఫీజు లేదు.

Posts Secil
ఎంపిక
విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి ఎంపిక చేస్తారు. ఒకవేళ దరఖాస్తులు, పోస్టుల సంఖ్య కంటే ఎక్కు వస్తే స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ నిర్వహించవచ్చు. ఎంపికైన వారికి జీతం నెలకు జీఎంకు రూ. 1,20,000 నుంచి 2,80,000, డీజీఎంకు రూ. 90,000 నుంచి 2,40,000, డీఎంకు రూ. 60,000 నుంచి 1,80,000, ఆఫీసర్‌కు రూ. 40,000 నుంచి 1,40,000, సీనియర్ ఇంజినీర్‌కు ఏడాదికి రూ. 9.9 లక్షలు ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ సెప్టెంబర్ 23. ఇతర వివరాలు వెబ్సైట్ https://www.seci.co.inలో చూడండి.