High Court | కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరిట ప్రభుత్వం హిమాయత్‌సాగర్‌లోని తమ భూములను తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
డీపీఆర్ లేకుండా భూసేకరణ ఎలా చేస్తారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కె.వివేక్ రెడ్డి, కె.ప్రతీక్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాస్థానం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిటిషనర్ల భూములని స్వాధీన పరుచుకోవొద్దని వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.