కల్వకుర్తి, సెప్టెంబర్ 10: మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం శాఖ మంత్రి హాజరయ్యారు.
ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, మైనార్టీ వెల్ఫేర్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌తో కలిసి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీ విఠాయిపల్లి గ్రామానికి చెందిన 50మంది శనివారం కల్వకుర్తిలో హోంమంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ఎవరు చేస్తారో ప్రజలకు తెలుసని అందుకే పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేసే పార్టీలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని, అలాంటి పార్టీలను దరిదాపుల్లోకి రానివ్వొద్దని మంత్రి పిలుపునిచ్చారు. దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశంలోనే ఉత్తమంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మనోహర, వైస్ ఎంపీపీ గోవర్ధన్, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీశైలం, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహెద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు విజయ్‌గౌడ్, సూర్యప్రకాశ్‌రావు, బోజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.