మక్తల్, సెప్టెంబర్ 10 : కురిసిన భారీ వర్షాలకు ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండాయి. మండలంలో ని కర్ని, రుద్రసముద్రం, మంథన్‌గోడ్, ఖానాపురం తదిత ర గ్రామాల్లోని చెరువులు శనివారం నిండి అలుగుపారా యి. ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు వరదనీరు రావడంతో రోడ్లు, బ్రిడ్జిలపై ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కర్నిలో పెద్దచెరువు అలుగుపారడంతో బ్రిడ్జిపై వరదనీరు ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలకు అం తరాయం ఏర్పడింది. అదేవిధంగా కర్ని, చిట్యాల, పస్పు ల, చిట్యాల, ముస్లాయపల్లి, అనుగొండ గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఏర్పడి రాకపోకలు స్తంభించిపోయాయి.
దామరగిద్ద, సెప్టెంబర్ 10 : మండలంలోని కానుకుర్తి, అన్నాసాగర్ రోడ్డు కురుస్తు న్న వర్షానికి రోడ్డు మొత్తం పాడై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. శనివారం కురిసిన అధిక వర్షానికి మండలంలో ని చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. కంకర మొత్తం తేలి ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలులేని విధంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాల ని ప్రజలు కోరారు.
ఊట్కూర్, సెప్టెంబర్ 10 : కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని పులిమామిడి బొల్లోనికుంట చెరువుకు గం డి పడింది. ఈక్రమంలో వరదనీరు పంట పొలాలను ముం చెత్తింది. వరుసగా గురువారం, శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కుంట కింద సాగైన పత్తి, వరి పంటలు దాదా పు 150 ఎకరాల్లో నీట మునిగినట్లు ఆయకట్టు రైతులు ఆ వేదన వ్యక్తం చేశారు.
రైతుల ఫిర్యాదు మేరకు తాసిల్దార్ తి రుపతయ్య శనివారం బొల్లోని కుంటను సందర్శించి పాడై న పంటలను పరిశీలించారు. రెండేళ్లుగా కుంటకు గండి పడి న విషయాన్ని సంబంధిత ఇరిగేషన్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని రైతులు తాసిల్దార్ దృష్టికి తెచ్చారు. కట్టకు మరమ్మతు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సూరయ్యగౌడ్, రైతులు పాల్గొన్నారు.
ధన్వాడ, సెప్టెంబర్ 10 : కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కేశవనగర్ (గొల్ల కాలనీ)లో మురుగు కా ల్వల నీరు నేరుగా ఇంట్లోకే వెళ్లుతున్నాయి. అదే కాలనీకి చెందిన అవుటి శ్రీశైలం మట్టిమిద్దె కూలిపోయింది. గ్రామ పంచాయతీ సిబ్బంది తమకు ఏమి పట్టలేదని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సిబ్బంది స్పందించి కాలనీలోని మురుగు కాల్వలను శుభ్రం చేసి వాన నీరు ఇంట్లోకి వెళ్లకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.