మక్తల్ టౌన్, సెప్టెంబర్ 10 : అర్హులందరికీ ఆసరా పథ కం నుంచి నూతన పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మక్తల్ మున్సిపాలిటీలో ని 16వ వార్డు రెండో దఫగా మంజూరైన 120 మంది లబ్ధిదారులకు పింఛన్ ప్రొసీడింగ్‌లు, గుర్తింపుకార్డులు శనివా రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. 57 ఏండ్లు కలిగి ఆసరా పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ నూతన పింఛన్‌ను అందిస్తున్నామన్నా రు. అర్హులైన వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్‌చైర్‌పర్సన్ అఖిల, కమిషనర్ నర్సింహులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నర్వ, సెప్టెంబర్ 10 : మండలంలోని ప్రతి ఒక్క వ్యక్తి సంక్షేమాభివృద్ధే తమ లక్ష్యామని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలో పర్యటించి ఉందేకోడ్‌లో నూతనంగా ని ర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ, అదనపు తరగతి గదులు, రైతువేదిక, లంకాలలో రైతువేదికను శనివారం ప్రారంభించారు. అనంతరం 861 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్ ప్రొసీడింగ్ ప త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్ అందిస్తామన్నారు. నియోజకవర్గానికి మరో 500 దళితబంధు యూనిట్లు మం జూరయ్యాయన్నారు.
సొంతం స్థలం కలిగిన వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, జెడ్పీటీ సీ జ్యోతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు చిన్నయ్య, వైస్‌ఎంపీపీ వీణావ తి, విండో వైస్‌చైర్మన్ లక్ష్మణ్, నాయకులు తదితరులు పా ల్గొన్నారు.