పాలమూరు, సెప్టెంబర్ 10 : గురుకుల విద్యాలయాల్లో స్వచ్ఛత పాటించి పరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులకు విద్య అం దించాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. స్వచ్ఛ గురుకుల వారోత్సవాల్లో భాగంగా శనివారం మహబూబ్‌నగర్ రూర ల్ మండలం రాంరెడ్డిగూడలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ గురుకులాల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రతిఒక్కరూ శుభ్రత పా టించి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని సూ చించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో అనిల్‌కుమార్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, ఎంపీ పీ సుధాశ్రీ, వైస్‌ఎంపీపీ అనిత, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, తాసిల్దార్ పాండూనాయ క్, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్ర య్య, మమత, ఇన్చార్జి ఎంపీడీవో నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.