మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐల మ్మ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని నాలుగోవార్డు ఎదిరలో శనివారం రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హన్మంతు, వెంకటయ్య, సూద న ర్సింహులు, బీకే రాములు, శ్రీనివాసులు, యాద య్య, నర్సింహులు పాల్గొన్నారు.
జడ్చర్ల, సెప్టెంబర్ 10 : మండలంలోని పలు గ్రామాల్లో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా ని ర్వహించారు. నసరుల్లాబాద్‌లో సర్పంచ్ ప్రణీల్‌చందర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. కార్యక్రమంలో రఘునందన్‌రావు, రామాంజనేయులు, మునవర్, కురుమూ ర్తి, నవీన్, శివ, రాములు, జంగయ్య ఉన్నారు.
మిడ్జిల్, సెప్టెంబర్ 10 : రజాకర్ల ఆరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని జె డ్పీటీసీ శశిరేఖ పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండలకేంద్రంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రామకృష్ణ, రాఘవేందర్, నర్సింహ, కేశవ్, బాలు, రాజేశ్వర్, భాస్కర్, శేఖర్, ఆచారి, శ్రీనివాసులు, అశో క్, జగన్‌గౌడ్, మల్లయ్య, గోపాల్ పాల్గొన్నారు.
రాజాపూర్, సెప్టెంబర్ 10 : మండలకేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు శంకర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు రామకృష్ణ, లింగం, శ్రీనూనాయక్, రమేశ్‌నాయక్, బాలరాజు, రాజు, ప్రవీణ్, అరుణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 10 : చిన్నచింతకుంట మండలకేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పర్దీపూర్‌లో సర్పంచ్ కోట సుప్రియ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బుచ్చన్న, శంకర్, సాంబశివుడు, రజక సంఘం నాయకులు వెంకటన్న, కృష్ణయ్య, రమే శ్, నర్సింహ, వెంకటేశ్, బాలరాజు, బాలేశ్వరి, అలివేల, మాధవి తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 10 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని అడ్డాకుల, కందూరు తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కా ర్యక్రమంలో సర్పంచులు మంజులాభీమన్నయాదవ్, శ్రీకాంత్, నా యకులు నాగిరెడ్డి, రమేశ్‌గౌడ్, శ్రీహరి, శ్రీనివాస్‌యాదవ్, మనోహ ర్, బుచ్చన్న, లక్ష్మయ్య, శ్రీనివాసులు, కొండయ్య, రాకే శ్, కృష్ణయ్య, నీలమ్మ, హారతి, బాబు, రాజు, వెంకటన్న, సత్యమ్మ, పద్మ, లక్ష్మ య్య తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, సెప్టెంబర్ 10 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకర్లకు ఎదురొడ్డి పోరాడిన చాకలి ఐలమ్మను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండలంలోని అప్పాజిపల్లిలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 200మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే బాలానగర్, నేరళ్లపల్లి గ్రామాల్లో రజక సంఘం నాయకులు ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు ఖలీల్, రమేశ్‌నాయక్, రమేశ్, సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్, రజక సంఘం మండల అధ్యక్షుడు యాదయ్య, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, ఎంపీటీసీ సుగుణ, టీఆర్ఎస్ ఎస్టీసెల్ మండల ఉపాధ్యక్షుడు రమేశ్‌నాయక్, అరుణ్‌కుమార్, బాలయ్య, గోపి, శ్రీనునాయక్ పాల్గొన్నారు.
నవాబ్‌పేట, సెప్టెంబర్ 10 : మండలంలోని యన్మన్గండ్లలో చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. అనంతరం చాకలి ఐలమ్మ పో రాట పఠిమను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్ రఘువీర్, నాయకులు హన్మం తు, శేఖర్, జంగయ్య, వేణు, రామస్వామి, యా దయ్య, లక్ష్మీనారాయణ, శివ పాల్గొన్నారు.