పాలమూరు, సెప్టెంబర్ 9: విద్యార్థులు కష్టపడి.. జీవతంలో స్థిరపడాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని బా లుర జూనియర్ కళాశాల ఆవరణలో ఒకేషనల్ విద్యార్థులకు నిర్వహించిన అప్రెంటీస్‌షిప్, జాబ్‌మేళాకు మంత్రి హాజరై మాట్లాడారు. అంతకుముందు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంత్రి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జాబ్‌మేళాకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. 2015నుంచి ఇప్పటివరకు ఒకేషనల్ విద్యార్థులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, ఏటా 1500నుంచి 4500 ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా ఒకేషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారన్నారు.
ఒకేషనల్ తర్వాత కొందరు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారని, మరికొందరు కుటుంబపోషణకు ఉద్యోగాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఏటా 14లక్షల మంది వలస వెళ్లేవారని, రెండు జీవనదులు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పల్లెలు బాగుపడ్డాయని, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇప్పిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేలా కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు రూ.2.20కోట్లతో నిర్మించిన భవనాన్ని త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇటీవల జిల్లాకేంద్రంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో రూ.80వేల గరిష్ఠ వేతనంతో 2500మందికిపైగా ఉద్యోగాలు ఇప్పించామన్నారు. 50 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధిని పాలమూరులో ఎనిమిదేండ్లలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసి చూపించారని ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరేటి వెంకన్న అన్నారు. గతం లో చూసిన పట్టణానికి, నేటికీ తేడా కనిపిస్తున్నదన్నా రు. మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఎవరూ ఊహించనిస్థాయిలో అత్యద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. అభివృద్ధిలో జరిగిన మార్పులను అన్ని రాజకీయపక్షాలు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ఇంటర్మీడియెట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో అనిల్‌కుమార్, డీఎస్పీ మహేశ్, నిర్మల్ డయాగ్నోస్టిక్ అధినేత తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.