నర్వ, సెప్టెంబర్ 9 : పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండ లంలోని పాతర్చేడ్ (99), రాజుపల్లి (13), రాయికోడ్ (43), పెద్ద కడుమూర్ (92), ఎల్లంపల్లి (51), సీపూర్ (31), కల్వాల (74) నూతనంగా పింఛన్లు మంజూరైన ల బ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు, గుర్తింపుకార్డులు శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెం డేండ్ల కిందట ఈ పింఛన్లను లబ్ధిదారులకు చేరవేయాల్సిఉండగా కరోనా కారణంగా అలస్యం అయిందన్నారు. అ లాగే రాబోవు రోజుల్లో అర్హత కలిగిన అందరికీ పింఛన్లు అందిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాభివృద్ధిని కోరుకుంటూ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పా రదర్శకంగా, నిస్వార్థంగా ప్రజలకు చేరవేయాలన్నారు. అ నంతరం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
పల్లె దవాఖాన ప్రారంభం
మండలంలోని కల్వాలలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ఎమ్మెల్యే చిట్టెం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు అనేక పథకాలను ప్రవేశపెట్టి, ఎల్ వోసీ, సీఎంఆర్ఎఫ్ నుంచి నగదును అందజేస్తుందన్నారు. పేదలకు వైద్యంను మరింత చేరు వ చేయాలనే ఉద్దేశంతో పల్లె దవాఖానలను ప్రా రంభించామన్నారు. కల్వాలతోపాటు మండలం లో మరో 8 పల్లె దవాఖానలు మంజూరయ్యాయని, వాటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వైద్యశాఖలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం, సిబ్బందికి చెల్లించే వేతనాలను పెంచడం జరిగిందన్నారు.
గ్రామాల్లో పర్యటన
మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించి కల్వాల ప ల్లె దవాఖానను ప్రారంభించేందుకు వెళ్తుండగా సీపూర్ గ్రా మస్తులు కల్వాల శివారులోనే ఎమ్మెల్యే కాన్వయ్‌ను నిలిపి తమ గ్రామానికి వచ్చి మీరే స్వయంగా పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయాల్సిందిగా అభ్యర్థించారు. అందు కు సీపూర్ గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్న వా గు ప్రవాహం తీవ్రంగా ఉండడంతో కారు నీటిలో వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఎమ్మెల్యే గ్రామస్తుల ట్రాక్టర్‌ను వరద ప్ర వాహంలో స్వయంగా నడిపి గ్రామస్తులను ఉత్తేజపర్చి సీ పూర్ గ్రామస్తులకు ప్రొసీడింగ్‌లను అందించారు. తిరు గు ప్రయాణంలో ఆదే వాగులో ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుతూ కల్వలకు చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, జెడ్పీటీసీ జ్యోతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతుబంధుసమితి మండలాధ్యక్షుడు చిన్న య్య, వైస్ ఎంపీపీ వీణావతి, విండో వైస్ చైర్మన్ లక్ష్మణ్, మక్తల్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహులుగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తా
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 9 : ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడు తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆలయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. జాతీయ రహదారి 167 నిర్మాణంలో భాగంగా నల్లజానమ్మ ఆలయం ప్రాంగణం రోడ్డుకు పూర్తి స్థాయిలో లోతట్టు అవుతుందని భక్తుల కోరిక మేరకు రోడ్డు కంటే ఎత్తు పెంచేందుకు పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే శుక్రవారం పనులను ప్రా రంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అ మ్మవారి ఆలయాన్ని అన్ని హంగుల్లో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.