ఊట్కూర్, సెప్టెంబర్ 9 : బం గాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ప్రభావంతో గురువారం రా త్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మండలంలో 74. 8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో వాగులు, వంక లు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని మల్లేపల్లి రోడ్డు డ్యాం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బీటీ రోడ్డు కోతకు గురైంది. వరద నీటి ప్రవాహంతో మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి, సోమేశ్వరబండ గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నట్లు సర్పంచ్ మా ణిక్యమ్మ తెలిపారు. రోడ్డు డ్యాం వద్ద వంతెన ని ర్మాణం చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని ఎమ్మెల్యే, అధికారులకు ఆమె విజ్ఞప్తి చే శారు. కాగా, భారీ వర్షానికి మండలకేంద్రంలో ని ర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్రను కొద్ది గంటలపాటు నిలిపి శుక్రవారం ఉదయం నుంచి తిరిగి కొనసాగించారు. రోడ్లు సైతం జలమయం అయ్యాయి. ఊట్కూర్, చిన్నపొర్ల, పెద్దపొర్ల, కొల్లూరు, అవుసలోనిపల్లి తదితర గ్రామా ల్లో వందలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు వరద నీటిలో ముని గిపోయాయి.
వరదొస్తే.. దారులు బంద్
మాగనూర్, సెప్టెంబర్ 9 : తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దులో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరడం తో శుక్రవారం 4 గేట్లు ఎత్తడంతో మాగనూర్ పె ద్దవాగుకు జలకళ ఏర్పడింది. పెద్దవాగుకు వరద రావడంతో మండలంలోని వాగు పరీవాహక ప్రాంత సమీపంలో ఉన్న వరి పంట పొలాలు నీ టలో మునిగిపోయాయి. మండలంలోని వర్కూ ర్, నేరడగం, అడవిత్యారం, కోల్పూర్, మందిప ల్లి, గజురందొడ్డి గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.
నీటి విడుదల
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 9 : ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాల కారణంగా చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వరద వస్తున్న క్ర మంలో శుక్రవారం 4 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. మండలంలోని సంగంబండ పె ద్ద వాగుపై భీమా ఫేజ్ వన్‌లో భాగంగా 3.313 సామార్థ్యంతో మక్తల్ నియోజకవర్గంలో లక్ష 11 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యం తో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. వదర వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్ 364 మీటర్లకుగా నూ 362.7 మీటర్ల లెవల్లో నీటి సామర్థ్యం ఉందని అధికారులు పేర్కొన్నారు.
అలుగుపారుతున్న పెద్దచెరువు
గుండుమాల్, సెప్టెంబర్ 9 : మండలంలోని భారీ వర్షం పడడంతో శుక్రవారం గుండుమాల్ పెద్ద చెరువు అలుగుపారింది. పెద్దచెరువు అలుగు పారడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. లోత ట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గండుమాల్, కొమ్మూర్కు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెవెన్యు, ఇరిగేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.