నారాయణపేట, సెప్టెంబర్ 9 : తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలను ఘ నంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో శుక్రవారం సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించుకున్న సందర్భంలో ఈనెల 16 నుంచి మూడు రో జులపాటు తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందు కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా 16న జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 15వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం సమావేశం నిర్వహిస్తామన్నారు. ర్యాలీకి వచ్చిన జనాల కు మధ్యాహ్నం భోజనం సాఫీగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జన సమీకరణ బాధ్యతలు డీఆర్డీఏ, ఎంపీడీవో, మెప్మా అధికారులకు అప్పగించారు.
ర్యాలీకి వెళ్లే దారిలో మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. అగ్నిమాపక వాహనం, 108 అంబులెన్స్ అందుబాటులో ఉండాలన్నారు. ర్యాలీకి వచ్చే ప్రజలు, విద్యార్థులకు కావలసిన జెండాలు సిద్ధం చేసుకోవాలన్నారు. 17న పరేడ్ గ్రౌండ్లో ముఖ్యఅతిథులతో పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, ప్రజాప్రతినిధులు మూడు రోజులు వజ్రోత్సవాల్లో భాగస్వాములు అయ్యే విధంగా సమాచారం అందించాలన్నారు. మధ్యాహ్నం హై దరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్ సీఎం పాల్గొనే కార్యక్రమానికి జిల్లాలోని గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే విధంగా ఆహ్వానించి బస్సు లో తరలించాలన్నారు. 18న సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. 14 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను త్రివర్ణ విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీఆర్డీవో గోపాల్‌నాయక్, ఆర్డీవో రాం చందర్, వివిధ శాఖల అధికారులు హతీరాం, కన్యాకుమారి, సీఐ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సునీత పాల్గొన్నారు.