కోస్గి, సెప్టెంబర్ 7 : పట్టణంలోని కొందరు వైద్యులు శం కర్ దాదా ఎంబీబీఎస్లుగా మారారు. పట్టణంలోని ఆర్ఎంపీ వైద్యురాలు రాజశ్రీ 7 నెలల నుంచి మద్దూర్ మండ లం లక్కాయిపల్లి గ్రామానికి చెందిన అంజిలమ్మ అనే గర్భిణికి వైద్యం అందిస్తూ అంతా బాగుంది నీకేమి పర్వాలేదని వైద్యం చేస్తూ వచ్చింది. మంగళవారం మరోసారి దవాఖానకు వచ్చింది. నీకేమి పర్వాలేదని స్కానింగ్ తీసుకురండి అని చెప్పింది. బుధవారం స్కానింగ్‌కు వెళ్లి రిపోర్టు తీసుకురావడంతో కడుపులో బిడ్డ మరణించింది. దీంతో నా దగ్గరకు ఇప్పుడొస్తారా అని బుకాయిస్తూ కడుపులో బిడ్డకు ప్రమాదం ఉంది.
వెంటనే మహబూబ్‌నగర్ వెళ్లాలని చె ప్పింది. వారు అప్పుడు చేసేదిలేక దిక్కుతోచని స్థితిలో మ హబూబ్‌నగర్ ప్రభుత్వ జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ స్కానింగ్ చేయగా కడుపులో బిడ్డ మరణించింది. ఇన్ని రోజులో ఏం చేశారంటూ డాక్టర్లు మందలించారు. త ల్లికి ప్రమాదమవుతుందని చెప్పి ఆపరేషన్‌చేసి కడుపులో పిండాన్ని తొలగించారు. మరోసారి తెలియని వైద్యుల వద్ద కు వెళ్లవద్దని ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయించుకోవాలన్నారు. విషయంపై డాక్టర్‌ను విచారణ కోరేందుకు ప్ర యత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.
నకిలీ వైద్యులపై చర్యలు తీసుకుంటాం
ఆర్ఎంపీలు గర్భిణులకు వైద్యం అందించరాదు. అస లు ఆమె ఆర్ఎంపీ వైద్యురాలా లేక ఏం చదువుతున్నది. ఆమె ఇలాంటి వైద్యం ఎందుకు చేస్తుంది. విషయంపై ఆరా తీస్తాం. దవాఖాను సీజ్ చేస్తాం.
– రామ్‌మనోహర్‌రావు, డీఎంహెచ్‌వో