జడ్చర్ల, సెప్టెంబర్ 7 : విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి పాఠశాలలు, దవాఖానల ను బలోపేతం చేస్తున్నదని జడ్చ ర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ధ్యాన్‌చంద్ జయంతి, నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని క్లాస్మేట్స్ సౌజన్యంతో బుధవారం జడ్చర్ల ఉన్న త పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టణస్థా యి అండర్-17 కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభు త్వం అన్నిరంగాల అభివృద్ధికి పాటుపడుతున్నదని తెలిపారు. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
జడ్చర్ల ఉన్నత పాఠశాల మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపికైందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసిన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రైవేట్‌కు దీటుగా ప్ర భుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. క్రీడల అభివృద్ధికి పల్లెలు, పట్టణాల్లో ఏర్పా టు చేసిన క్రీడాప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, ము న్సిపల్ చైర్మన్ లక్ష్మి, ఎంఈవో మంజులాదేవి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, ఎర్రశ్రీను, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, రాజు, జ్యోతి, లత, మహేశ్, శశికిరణ్, చైతన్య, ఇమ్మూ, ప్రీతం, ఊళ్లబాయి యాదిరెడ్డి, బీకేఆర్, ఇర్ఫాన్, శంకర్‌నాయక్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
గణనాథుడికి పూజలు
జడ్చర్ల మున్సిపాలిటీలోని కేకేనగర్కాలనీలో కొలువుదీరిన గణనాథుడికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సామ రఘురాంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాగిరెడ్డి, పర్మటయ్య, మధుసూదన్‌రెడ్డి, రమణయ్య, ఇబ్రహీం, రాజుఆచారి, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది
మిడ్జిల్, సెప్టెంబర్ 7 : ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, సర్పంచ్ రాధికారెడ్డి, ఎంఈ వో మంజులాదేవి, సుధాకర్, రవికుమార్, రాంప్రసాద్, మోహన్, రమేశ్, ఉత్తమ ఉపాధ్యాయులు వల్లభురావుపల్లి శ్యాంసుందర్‌రెడ్డి, లింబ్యాతండా అంజమ్మ, లాక్యాతండా మల్లయ్య, వస్పుల్ మోహన్, మిడ్జిల్ ప్రభావతి, కృష్ణ, మల్లాపూర్ మురళీధర్, తముడకుంటతండా కవిత, ఉపాధ్యాయ సంఘం నాయకులు నర్సింహులు, మోహన్‌కుమార్, వసంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.