కోయిలకొండ, సెప్టెంబర్ 6 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదరిక నిర్మూలన జరుగుతున్నదని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అ న్నారు. మంగళవారం మండలంలోని విజమూరు, శేరివెంకటాపూర్, కోయిలకొండ, మనికొండ, గార్లపాడు లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఉ దయం 9 నుంచి రాత్రి వరకు ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లిన సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్ వస్తుందా.. అని వృద్ధులను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలుకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని తెలిపారు. గత పాలకులు 65 ఏండ్లు దాటిని వారికి కేవలం రూ.200 పింఛన్ మాత్రమే ఇచ్చేవారని, నేడు 57 ఏండ్లు నిండితే చాలు రూ.2,016 పింఛన్ అందజేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.500 మా త్రమే ఇస్తున్నారని విమర్శించారు. మన పథకాలు ఎ న్నో ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఇంత చేస్తున్న ప్రభుత్వంపై బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోయిలకొండ మండలంలో కో ట్ల రూపాయాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మండలానికి సాగునీరు అందించి తీరుతామని హామీ ఇచ్చారు. మండలంలోని 44 గ్రామాల్లోని అర్హులకు కొత్తగా 2,031 పింఛన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. పింఛన్ల మంజూరుకు ఎవరికీ ఒక్క రూ పాయి ఇవ్వొద్దని సూచించారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులు, అంగన్వాడీ కేంద్రాల్లో కిశోర బాలికలకు పౌష్టికాహార కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
కార్యక్రమంలో నవోదయ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శశికళా భీంరెడ్డి, జెడ్పీటీసీ విజయ భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్య యాదవ్, రైతుబంధు సమితి కన్వీనర్ మల్లయ్య, తాసిల్దార్ ప్రేమ్‌రాజ్, ఎంపీడీవో జయరాం, ఎంపీవో శ్రీదేవి, ఈవో రాంపాల్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గిరిధారి నాగయ్య, రాజవర్ధన్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.