గద్వాలటౌన్, సెప్టెంబర్ 5: తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్నిస్తారని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సమాజంలో గురువులపాత్ర ఉన్నతమైనదన్నారు. గురువులపై ప్రతి విద్యార్థి అంకితభావంతో ఉండాలన్నారు. చదువు చెప్పే వారు మాత్రమే గురువులు కాదని, సన్మార్గంలో నడిపించే ప్రతిఒక్కరూ గురువులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదన్నారు. విద్యార్థులు సమాజంలో ఉన్నతస్థాయిలో రాణించడానికి తల్లిదండ్రుల కృషి ఎంత ఉంటుందో గురువుల కృషి కూడా అంతే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో సిరాజుద్దీన్, ప్రిన్సిపాల్ శ్రీపతినాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మల్దకల్, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేశ్లింగం, అధ్యాపకులు రామాంజనేయులుగౌడ్, నర్సింహులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
కేటీదొడ్డి, సెప్టెంబర్ 5: మండలంలోని నందిన్నె రాఘవేంద్ర పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. అదేవిధంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాఘవేంద్ర, వెంకటేశ్, అంజలి, శిరీష, శారద, భారతి, నవిత తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్, సెప్టెంబర్ 5: ప్రతి విద్యార్థిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడేనని ఎంఈవో అశోక్‌కుమార్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలోని 14 మంది ఉత్తమ ఉపాధ్యాయులను దాతల సహకారంతో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉండవెల్లి, సెప్టెంబర్ 5: మండలకేంద్రంలోని ఎమ్మార్సీలో సోమవారం ఎంఈవో శివప్రసాద్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ భీసమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న జీహెచ్ఎంలు రాములు, రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అయిజ, సెప్టెంబర్ 5: విద్యార్థుల భవితకు ఉపాధ్యాయులు బాటలు వేయాలని హెచ్ఎం కృష్ణ అన్నారు. సోమవారం పట్టణంలోని ఠాగూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ తిమ్మప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.
వడ్డేపల్లి, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలోని ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
ఎర్రవల్లిచౌరస్తా, సెప్టెంబర్ 5: ఇటిక్యాల మండలం ఎర్రవల్లిచౌరస్తా పదోపటాలంలోని సాయుధ చైతన్య పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం షాషావలి, స్కూల్ ఇన్చార్జి సురేశ్, వెంకటేశ్, తిమ్మప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.