మూసాపేట (అడ్డాకుల), సెప్టెంబర్ 5 : పీఎం నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీలకు అమ్మడంతోపాటు పంచుకుంటున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. అడ్డాకుల, రాచాల గ్రామాల్లో సోమవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులు, ఆసరా పింఛన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎనిమిదేండ్ల కిందట అధికారంలోకి వచ్చిన మోదీ దేశానికి ఏమీ చేయలేదని, కానీ సీఎం కేసీఆర్ రా ష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆపాలనే దురుద్ధేశంతోనే దేశంలోని బీజేపీ నేతలు ‘తెలంగాణకు మిడత దండులా’ వచ్చి పర్యటిస్తూ తప్పుడు ప్రచారం చేయడంతోపాటు గందరగోళం సృ ష్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించి ఏమీ చేయలేదని, కానీ ఇప్పుడు రాహుల్‌గాంధీ ఏక్‌బార్ మోకా దేవ్ అని మరో నాటకానికి తెరలేపారన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ నిర్వీర్యమైపోతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ర్టాలకు వెళ్లి మన రాష్ట్రంలోని ఒక్క పథకమైనా అమలవుతుందా..? అని అక్కడి ప్రజలనే అడిగి తెలుసుకుందామని సవాల్ విసిరారు. కార్యక్రమంలో తాసిల్దార్ కిషన్, ఎంపీడీవో మంజుల, వైస్ ఎంపీపీ రాధిక, జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జయన్నగౌ డ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తి రుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, సర్పంచులు మంజుల, శ్రీకాంత్, ఎంపీటీసీ రంగన్నగౌడ్, జెడ్పీ కో ఆప్షన్ మాజీ స భ్యుడు మహమూద్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, బాలరాజు, సర్పంచు లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.