అమ్రాబాద్, సెప్టెంబర్ 5 : అటవీ ఉత్పత్తులతో అధిక లాభాలు పొందొచ్చని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటవ్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్), రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రాకేశ్ మోహన్ దొబ్రియల్ అన్నారు. సోమవారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. భౌరాపూర్లోని చెంచులకు తేనెటీగల పెంపకం, తేనె సేకరణపై అవగాహన కల్పించి తేనెటీగల తయారీ డబ్బాల ను అందజేశారు. పుట్టగొడుగుల పెంపకం కోసం మన్ననూర్ గ్రామంలో పెంపకం గది (చీకటిగది)ని ప్రారంభించారు. అనంతరం చెంచు కుటుంబాలతో కలిసి భోజనం చేశా రు.
అదేవిధంగా చెంచులతో ముచ్చటిస్తూ అటవీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా చెంచులు అటవీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు చెంచులు అటవీ సిబ్బందికి సహకరించాలని కో రారు. ప్లాస్టిక్ కవర్లను నిషేధించి బట్ట సంచులను వాడాలని చెంచులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్‌వో రోహిత్గోపి, నవీన్‌రెడ్డి, ఏసీఎఫ్ ఎఫ్‌డీవో శ్రీనివాస్, మన్ననూర్, మద్దిమడుగు రేంజ్ అధికారులు పాల్గొన్నారు.