బిజినేపల్లి, సెప్టెంబర్ 5 : అర్హులైన ప్ర తి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందుతాయని, ఎవరూ సందేహపడొద్దని ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని పాలెం, వడ్డెమా న్, బిజినేపల్లి, వట్టెం గ్రామాల్లో పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ వరకు కొత్త పింఛన్‌దారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీఆర్ ఎంతో మంచి చేశారని, వారి తర్వాత పేదల కోసం శ్రమిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. కేం ద్రం సహకరించకున్నా రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. కేంద్రం మోటార్లకు మీటర్లు బిగించాలని చెబుతున్నా.. సీఎం ససేమి రా అన్నారన్నారు. పింఛన్ రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఇస్తామన్నా రు.
దసరా తర్వాత అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామన్నారు. జిల్లాకు రూ.600 కోట్లతో మెడికల్ కళాశాలను తీసుకొస్తే మాజీ మంత్రి నాగం అన్ని పార్టీల నేలతో ధర్నాలు చేయించి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గతంలో ఇంజినీరింగ్ కళాశాలను అమ్ముకున్న ఘనత నాగంకే చెల్లిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మ య్య, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ బాలరాజుగౌడ్, సర్పంచు లు లావణ్య, సుదర్శన్‌గౌడ్, అమృత్‌రెడ్డి, ఎంపీడీవో కృష్ణయ్య, తాసిల్దార్ అంజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకు లు తదితరులు పాల్గొన్నారు.